బుద్ధుని మహా పరి నిర్వాణం ;- చిరసాని శైలూషి,నెల్లూరు.

 ధర్మ పతనాన్ని నిరోధించటానికి మరో ఏడు నియమాలను బుద్ధుడు బోధించాడు అవి వూసుపోనీ కబుర్లతో మునిగి సంతోషంలో తేలిఆడనంత కాలం చెడు కోరికలు చెడు స్నేహితుల బారిన పడనంత కాలం శాశ్వత ఆనందాన్ని కలిగించే మార్గాన్ని ప్రారంభ దశలోనో మధ్యలో నో వదిలివేయునంత కాలం భిక్షువులు ధార్మిక ప్రగతి పథంలో ముందుకు సాగుతూ పతనాన్ని నిరోధించు కోగలుగుతారు అంతేకాక విశ్వాసపాత్రులై చేతనతో లజ్జా శీలురు పండితులు వీర్యవంతులు అవగాహన కలిగినవారై స్మృతి ఉన్నంతకాలం వారు ధర్మ పురోగాములు గానే ఉంటారు భిక్షువులు పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగించే భోజ్యంగాలను బోధికి తోడుకొని పోయే ఏడు అంగాలు సమకూర్చుకొని స్మృతి తో మెలిగే వారు వివిధ భూమికళను సమకూర్చుకొని స్మృతి తో మెలిగే వారు ఎరుకతో వీర్యం సుఖం సమత సమాధి ఉపేక్షలతో ముందుకు సాగే వారు ధార్మిక పురోగాములు అవుతారు అని మరో  ఏడు నియమాలు బోధించాడు బుద్ధుడు అలాగే భిక్షువులు అనిత్యా అనాత్మ భావములను వృద్ధి చేసుకొని సోమరితనం భయం మోహాలకు తావీయకుండా మోహ విరహతులై ఉన్నంతకాలం ధార్మిక ప్రగతిని సాధిస్తుందని ముందుకు సాగిపోతూ గమ్యాన్ని చేరుకుంటాడు అనే మరో ఏడు నియమాలను కూడా బోధించారు తమ పవిత్ర జీవనంలో తమ సహచరుల పట్ల గల దయ కారుణ్య భావనలను మనసా వాచా కర్మల ఆచరిస్తున్నంత కాలం తమ సహచరుల పట్ల పక్షపాతం లేకుండా దీక్షా పాత్రలో ఏముందో చూడకుండానే పంచుకునే తత్వంతో ధార్మిక ఔన్నత్యాన్ని పెంపొందించుకున్నంత కాలం సమాధి స్థితికి దోహదo చేసే మంచి శీలాన్ని ఆచరిస్తూ ఉన్నంతకాలం మళ్లీ మళ్లీ పుడుతూ గిడుతూ ఉండే సంసార చక్ర బంధం(భవచక్రం) నుంచి శాశ్వత విముక్తిని కలిగించే ఆర్య సత్యాలను ఎరిగి  సన్మార్గం ద్వారా దుఃఖ నివృత్తికి అంకితుడై ఉన్నంతకాలం ధార్మిక పురోగాములుగా ఉంటారు అని మరో ఆరు నియమాలను వివరించారు బుద్ధుడు.కొంతకాలం తరువాత బుద్ధుడు ఆనందుని పిలిచి ఆనందా ఇక పోదాం అనగానే అలాగే నన్ను ఆనందుడు తగిన ఏర్పాటు చేశాడు సంఘం వెంట రాగా బుద్ధుడు రాజుకు చెందిన ఒక విశ్రమనశాలలో బస చేశాడు  అక్కడున్నప్పుడు కూడా భిక్షువులకు శీల సమాధి ప్రజ్ఞలను సంతరిoచుకుంటే అవి ఎలా కామ తృష్ణ మళ్లీ మళ్లీ పుట్టాలని కోరిక నుంచి విముక్తి కలిగిస్తాయో  బోధించాడు  తథాగతుడు అంబలటికాలో కొంతకాలం ఉన్న తర్వాత ఒకనాడు ఆనందునితో తాను నలంద ను దర్శించాలని చెప్పగా ప్రయాణానికి ఏర్పాటు కావించాడు ఆనందుడు నలoద కు చేరుకున్న బుద్ధులు పావాలిక అనే మామిడి తోటలో బస చేశాడు ఈ సందర్భంలో పావాలిక లో ఉన్న బుద్ధున్ని సారి పుత్రుడు దర్శనం చేసుకుని సంబోధిని పొందిన గొప్పవారు అటు బ్రహ్మణులలో కాని ఇటు శ్రమనులలో కానీ ఎక్కడ కానీ మరోచోట కానీ అంతకు ముందుగానే ఇప్పుడు గాని  లేరని రాబోయే కాలంలో కానీ ఉండరని నేను చెప్పగలుగుతున్నాను అన్నాడు.
==============================
సమన్వయం ; డా. నీలం స్వాతి 
కామెంట్‌లు