బుద్ధుని మొదటి ప్రవచనం;- చిరసాని శైలూషి,నెల్లూరు.

 కొంతకాలం ఆలారా కాలముని బోధలు విని సిద్ధార్థుడు కాలమా మీరు సాధించిన ప్రజ్ఞతో మీరు దర్శించినది ఏమిటి అని అడిగాడు అందుకు కాలాముడు మిత్రమా నేను  శూన్యతా భూమిక ను అంటే శూన్యత స్థితిని చేరుకొని ఏకాగ్రతను సాధించాను అని చెప్పాడు ఆయన బోధన సిద్ధార్థులు కూడా కాలాముని మాదిరిగానే శ్రద్ధ వీర్యము స్మృతి సమాధి ప్రజ్ఞలను అభ్యాసం ద్వారా అనుభవంలోకి తెచ్చుకున్నాడు ఇది గమనించిన కాలాముడు సిద్ధార్థను ఉద్దేశించి మిత్రమా నేను దర్శించిన సత్యాన్ని మీరు దర్శించారు నాకు తెలిసిందే మీకు తెలిసింది నేను మీరు సత్యాన్ని ఒకేలా తీసుకున్నాము రండి మనం ఇద్దరం పరివ్రాజకుల సంఘాన్ని నెలకొల్పుదాం అని ఆహ్వానించారు.అంతకుమించి ముందుకు సాగని కాలామని ప్రజ్ఞ అంతిమ సత్యాన్ని అందించలేక పోయిందని గుర్తించాడు సిద్ధార్థుడు  పూర్తిగా సత్య దర్శనం కాని  తాను సంఘాన్ని స్థాపిస్తే చూపులేని వాడు మరో చూపు లేని వాడిని నడిపించినట్లు అవుతుంది అని కాలముని బోధన పట్ల సంతృప్తి చెందని సిద్ధార్థుడు పరిపూర్ణజ్ఞానం కోసం ధార్మిక ఉన్నత ప్రగతి కోసం కాలముని ని విడిచిపెట్టి అన్వేషణ కొనసాగించాడు అందులో భాగంగా సిద్ధార్థుడు వుద్దక రామ పుత్రుడని మరో మునిని కలుసుకున్నాడు పరమ సత్యాన్ని కనుగొనడానికి తాను తపన పడుతున్నానని మీరు అంగీకరిస్తే మీ బోధలు విని సాధన చేసి పవిత్ర జీవితం గడుపుతానని సిద్ధార్థుడు రామ పుత్రుడు తో అన్నాడు అందుకు సరే అన్న రామపుత్రుని శిష్యరికంలో సిద్ధార్థులు చిత్త ఏకాగ్రతతో చివరి దశ అయిన  సంజ్ఞ అసంజ్ఞ స్థితికి చేరాడు.
తరువాత సమాధిపరమైన సాధనలో ఉన్నతమైన ఉత్తమమైన స్థితిని పొందాడు కొద్దికాలంలోనే సిద్ధార్థులు సాధించిన ధార్మికోన్నత ప్రగతి పట్ల తృప్తి చెందిన ఉద్దక రామ పుత్రుడు ఆనందించి మిత్రమా నాకు తెలిసిందంతా నీకు తెలుసు నేను ఏమిటో మీరు అదే రండి యతి సంఘానికి మీరు నాయకుడుగా ఉండడానికి అంగీకరించండి అని కోరాడు అన్నిటికంటే ఉన్నతమైన తృష్ణ రాహిత్యాన్ని దుఃఖ నిరోధాన్ని అందించగల అంతిమ విముక్తి మార్గం ఇంకా అంతుచిక్కనందు వల్ల వుద్దకరామ పుత్రుని బోధలతో సంతృప్తి చెందని సిద్ధార్థుడు సత్యాన్వేషణలో భాగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు  పరమ సత్యాన్ని కనుగొనడానికి ఇతర గురువుల సహాయాన్ని తీసుకోవాలి అనుకున్న సిద్ధార్థులు తాను వెతుకుతున్న సత్యాన్ని ఎరుకపరిచే బోధలు చేసే వారు ఎవరు లేరు అని గుర్తించాడు అంతేకాక సాధన ద్వారానే పరమ సత్యాన్ని ఎవరికి వారే అనుభవoలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు  ఇక మీదట ఆ పనికి తానే పూనుకున్నాడు. 
=============================
సమన్వయం ; డా. నీలం స్వాతి 
కామెంట్‌లు