డయోరియ పై అవగాహన
 తొట్టంబేడు :మండలం లో దిగువ సాంబయ్య పాళెంప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు అతిసారం ,చేతి శుభ్రత పై అవగాహన కార్యక్రమంజరిగింది.ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ నాగేంద్ర మాట్లాడుతూ విద్యా ర్థులు, గ్రామస్తులు చేతి వేళ్ళను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,మలవిసర్జనకు బహిర్భూమికి వెళ్లరాదని,కలుషితమయిన ఆహార పదార్థాలు,తాగు నీరు

వాడరాదని అతిసార వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియ చేసారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులుకయ్యూరు బాలసుబ్రమణ్యం, ఎ.ఎన్.ఎమ్. ఇందిరమ్మ, ఆశా వర్కర్ దుర్గ, అంగన్వాడీ కార్యకర్త మోహన రాణి,గ్రామస్తులు పాల్గొన్నారు.
కామెంట్‌లు