శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
981)యజ్ఞాoతకృత్ -
===============
యజ్ఞము చివరికి ఫలమిచ్చువాడు 
కార్యక్రమం ఫలితమొసగువాడు 
యాగఫలములు అందించినవాడు 
యాగప్రభావము చూపించువాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
982)యజ్ఞగుహ్యంమ్ -

గోప్యమైన యజ్ఞముల చేయువాడు 
గుప్తయజ్ఞము తానైనట్టివాడు 
విశ్వయజ్ఞములకు కారకుడు 
స్వామి యాగరహస్యమైనవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
983)అన్నం-

ఆహారము తానే అయివున్నవాడు 
అన్న పరబ్రహ్మగా నుండినవాడు 
నిరంతర ప్రసాదం అయినవాడు 
ప్రాణులకు ఆకలి తీర్చెడివాడు 
 శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
984)అన్నాదః -

అన్నమును స్వీకరించునట్టివాడు 
ప్రసాదమును పొందుచున్నవాడు 
ఆహారభక్షణమును చేయువాడు 
భక్తుల నైవేద్యము అందుకొనువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
985)ఆత్మయోనిః -

తననుండే ఆవిర్భావమగువాడు 
ఆత్మనుండి జనియించినవాడు 
అనాదినుండి యున్నట్టివాడు 
తనపుట్టుకకు మూలమైనవాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!

(సశేషము )

కామెంట్‌లు