నువ్వు నేను - తమిళంలో మనుష్యపుత్రన్అ-నుసృజన - జయా
 నువ్వు 
నన్ను దూరం చేసుకోవాలనేది
నీలో ఎప్పుడు ఎలా 
మొదలైంది?
నేను నీకు
ఏ హానీ చేయకుండానేనా
నాకు నీమీదున్న 
విశ్వాసం రవ్వంతకూడా
చెదరకముందేనా
నేను
నీకింకా కావలసిన వ్యక్తిగానే
ఉన్నప్పుడేనా
నీ రహస్యాలను
నేనేది చెప్పనే లేదే
అయినా
నన్ను దూరం 
చేసుకోవాలనే ఆలోచన
నీలో ఎప్పుడు ఎలా
మొదలైంది?
అది ఓ పువ్వు
తానే రాలిపోయే క్షణమా...
లేక
భగవంతుడు
నన్ను వదిలేసిన క్షణమా...
------------------------------


కామెంట్‌లు