పర్యావరణాన్ని ప్రేమిద్దాం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఈ భూమ్మీది సమస్త జీవరాశి 
ఎప్పుడో ఒకప్పుడు
పరస్పరం అవసరపడుతుంటాయి
మనుషులు, వృక్షాలు, జంతువులు,
పక్షులు, కీటకాలు, సూక్ష్మజీవులు 
ఇలా వైవిధ్య భరితమైన జీవజాలం 
ఒక దానిపై ఇంకొకటి ఆధారపడి ఉన్నాయి 
ఏ ఒక్కజీవికి కొరత ఏర్పడినా
మిగతా జీవుల జీవనం
కష్టాల పాలవుతుంది
మనిషికి తన చుట్టూ వైవిధ్యభరితమైన
జీవరాశుల సహచర్యంతోనే మనుగడ
ఏ జీవరాశి ఎంతుండాలో 
ఆ పర్యావరణం నిర్ణయించింది కానీ,
మనిషి తన స్వార్థంతో 
పర్యావరణాన్ని దెబ్బతీస్తుంటే
అది చూస్తూ ఊరుకుంటుందా?
తన శత్రువును నిర్దయగా తొలగించుకుంటుంది
అందుకే మన పర్యవరణాన్ని ప్రేమిద్దాం!
సర్వభూతములందు భగవంతుని చూద్దాం!
ఏ జీవికీ కష్టనష్టాలు కలగకుండా చేద్దాం!
మన జీవితాలను సుఖమయం చేసుకుందాం!!
----------------------------------------------------------

కామెంట్‌లు