శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
956)ప్రాణదః -
==========
ప్రాణప్రదాతయై యున్నవాడు 
జీవచేతనముకు ప్రసాదకుడు 
శక్తి దాయకునిగా నున్నవాడు 
ప్రాణద యని పిలువబడువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
957)ప్రణవః -

ప్రణవస్వరూపుడు అయినవాడు 
ఓంకార శబ్దము తానైనవాడు 
దేవతలకు ప్రధానమైనవాడు 
ప్రణవ నామమున్నట్టి వాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
958)పణః -

సర్వకార్యములకు నిర్వాహకుడు 
ధనమును సమకూర్చుచున్నవాడు 
విలువలు కట్టుచున్నట్టివాడు 
నిర్ణయములు చేయుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
959)ప్రమాణః -

స్వయముగా జ్ఞానస్వరూపుడు 
దివ్యప్రమాణము అయినవాడు 
సత్యము, శాశ్వతమైనట్టివాడు 
ప్రత్యక్ష ప్రమాణము అయినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
960)ప్రాణనిలయః -

సమస్తజీవుల ప్రాణనిలయుడు 
ప్రాణులన్నిటికీ విరామకుడు 
అంతిమ స్థానమైనట్టివాడు 
పరమపదము చేర్చగలవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
(సశేషము )

కామెంట్‌లు