బుద్ధిని మొదటి ప్రవచనం;- చిరసాని శైలూషి,నెల్లూరు.
 భిక్షువులారా మీరు ఏమనుకుంటున్నారు విజ్ఞానం ఆత్మ అయితే మరి ఈ విజ్ఞానం దుఃఖానికి ఎందుకు గురి అవుతుంది. నా విజ్ఞానం దుఃఖానికి గురి కాకుండా మరియు విజ్ఞానంలో ఆత్మ లేదు కాబట్టి అది దుఃఖానికి గురవుతుంది అందుకని ఎవరు నా విజ్ఞానం ఇది నా విజ్ఞానం కాదు అని అనుకోకూడదు  అని చెప్పి ఇటు చూడగా మీరేమనుకుంటున్నారు ఈ రూపం నిత్యమా అనిత్యమా అని అడగ్గానే అనిత్యం  పూజనీయా అన్నారు వారంతా మరి ఈ అనిత్యమైనది దుఃఖకరమా సుఖకరమా అనగానే పూజనీయా దుఃఖకరం  అని అంతా కలిసి చెప్పారు మరి ఈ అనిత్యమైన దాన్ని దుఃఖకరమైన దానిని ప్రతిక్షణం మార్పుకు గురయ్యేదాన్ని చూసి ఇది నాది ఇది నేను ఇది నా ఆత్మ  అని అనుకోవచ్చా అంటే లేదు పూజనీయ  అన్నారు.
అప్పుడు బుద్ధుడు మరి అలాంటిఅప్పుడు భిక్షువులారా భౌతిక రూపం అనిత్యమైన వర్తమానాన్ని తగిన వైయక్తికమైన బాహ్య సంబంధమైనదిగా సూక్ష్మమైన దైన  స్థూలమైనదైన దగ్గరైన దూరమైనా ఉన్నతమైనదైనా నీచమైనదైన సమ్యక్ దృష్టితో స్వభావ పూర్వకంగా ఇది నాది కాదు నేను ఇది కాదు ఇది నా ఆత్మ కాదు అని అర్థం చేసుకోవాలి అన్నారు  ఇంకా  అన్ని వేదనలు సజ్ఞలు, సంభారాలు విజ్ఞానాలు గతానివైనా వర్తమానం బాహ్య సంబంధమైన సూక్ష్మమైన స్థూలమైన దగ్గర దూరమైన  ఉన్నతమైన వాటిని ఇవి నావి కావు ఇవి నేను కాను ఇది నా ఆత్మలు కావు అని స్వయం దృష్టితో అర్థం చేసుకోవాలి భిక్షువులారా ఈ విషయాలను గ్రహించిన సత్యాన్ని నేను చెప్పిన పంచస్కంధాలైన రూపం వేదన సన్యాసి సంబరాలు విజ్ఞానాల పట్ల వైముఖ్యంతో తృప్తి లేనివాడై వీరాగినై విముక్తుడై తనకిక మరో పుట్టుక లేదని తాను పవిత్రమైన జీవితం గడిపానని మరణాన్ని శాశ్వతంగా జయించానని తెలుసుకుంటారు.ఇలా చెప్పిన బుద్ధుని మాటలు విన్న పంచవర్గీయ భిక్షువులు తమ మనసుల్లోని మలినాలను ఆసవాలను కడుక్కొని రాగాలనుంచి విముక్తుడై తృప్తి చెంది  పరిపూర్ణమైన సంబోధిని పొంది భగవానుని అభినందించారు  కాశీలో ఒక ధనికునికి యశుడు అని కొడుకు ఉన్నాడు తండ్రి లక్షాధికారి కాబట్టి యసుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఒకరోజు ఉదయాన్నే లేచి లేవగానే అతడు తన గదిలో ఒళ్ళు తెలియకుండా వివిధ భంగిమల్లో వికారంగా నిద్రపోతున్న పరిచారికలు నాట్యగర్తలు వాద్యగాలను చూశాడు యశునికి అదొక రకమైన నీచకారంగా అనిపించి అర్థం లేని ఈ రకమైన స్థితి పట్ల విరక్తి చెందాడు వెంటనే ఇంటిని వదిలి వేశాడు.
===================================
సమన్వయం ; డా. నీలం  స్వాతి 



కామెంట్‌లు