రత్నలక్ష్మికి విశాలాక్షి అవార్డు
నంద్యాల తెలుగుగంగ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న ఎస్. రత్నలక్ష్మి ప్రవృత్తి రీత్యా తెలుగు సాహిత్యంలో విశిష్ట రచనలు చేస్తూ అనేకానేక సాహిత్య సంస్థల ద్వారా పలు సన్మాన సత్కారాలు పొందారు. అందులో భాగంగా విశాలాక్షి మాస పత్రిక వారు జాతీయస్థాయిలో నిర్వహించిన కవితల పోటీలో విజేతయైన సందర్భంగా ఇటీవల  నెల్లూరు టౌన్ హాల్లో విశాలాక్షి మాసపత్రిక వ్యవస్థాపకులైన ఈతకోట సుబ్బారావు గారు, డిప్యూటీ కలెక్టర్ సవరమ్మ గారు, విశిష్ట రచయిత్రి శీలా సుభద్రాదేవి గారు, నరసం అధ్యక్షురాలైన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి మరియు అక్షరం వాట్సప్ గ్రూప్ అడ్మిన్ గారైన శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు, ప్రముఖ రచయిత్రి కవయిత్రియైన గోవిందరాజుల సుభద్రాదేవి గార్ల స్వహస్తాలతో నగదు బహుమతి ప్రదానంతో బాటు, అందమైన శాలువతోనూ మరియు అపూర్వమైన జ్ఞాపికతో ఎస్ రత్నలక్ష్మిని ప్రశంసిస్తూ ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్తలు మరియు పుర ప్రముఖులు రత్నలక్ష్మిని అభినందించారు.

 

కామెంట్‌లు