సునంద భాషితం ;- వురిమళ్ల సునంద, అర్కాన్సాస్ అమెరికా
 న్యాయాలు-552
న్యాయము
దారు పురుష న్యాయము
******
దారు అంటే కొయ్య, దేవదారు వృక్షము,చీల్చువాడు,ఉదారుడు,దానశీలుడు, ఇత్తడి. పురుష అంటే మనుజుడు, పురుషుడు, పరమాత్మ, జీవుడు అనే అర్థాలు ఉన్నాయి.
కర్ర దుంగను చూసి మనుష్యుడని భ్రమించినట్లు.
 ఒక వడ్రంగి కర్రతో ఓ మనిషి బొమ్మ చేశాడు . దానిని ఇంటి గుమ్మం ముందు నిలబెట్టి,తన అవసరాలు ,పనులు, సామానులు  మొదలైన వాటి కోసం బయటకు వెళ్ళే వాడు.
పరిచయం ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వారికి అది బొమ్మ అనే విషయం తెలియదు. ఆ దారిలో వచ్చే పోయే వాళ్ళు  అక్కడ ఉన్న ఆ మనిషి బొమ్మను చూసి ఎవరో వ్యక్తి ఇంటికి కాపలా ఉన్నాడు కాబోలు అనుకునేవారు.
 ఒక రోజు ఓ దొంగ ఆ వడ్రంగి  ఇంట్లో లేని సమయంలో రాత్రి పూట ఇంటి వెనుక నుండి కన్నం వేసి లోపలికి వెళ్ళి దొరికినవి మూట కట్టుకున్నాడు బయటకు వచ్చి ఇంటి ముందు గుమ్మం దగ్గర నిలబడి ఉన్న మనిషి బొమ్మను చూశాడు.అంతే తాను దొంగిలించిన సొమ్మును అక్కడే వదిలేసి భయపడి పారిపోయాడు.కారణం ఆ బొమ్మ మనిషి అని, తనపై ఎలాగూ దాడి చేస్తాడని భ్రమించి "బతుకు జీవుడా" "బతికుంటే బలుసాకు తినైనా జీవితం గడపొచ్చు" అనుకుంటూ  వెళ్ళి పోయాడు.
అలాగే పులి, సింహం లాంటి బొమ్మలు చూడగానే భయం గొలిపే విధంగా సజీవంగా కనిపిస్తూ వుంటాయి. (వాటిని  తయారు చేసిన దారు శిల్పుల నైపుణ్యానికి జేజేలు పలకకుండా,శిరసు వంచి నమస్కరించకుండా వుండలేం).అవి కర్రతో చేయబడినవని తెలిస్తే భయమనేది వుండదు.తెలియనంత వరకు అవి నిజమైనవేనని భ్రమ కలుగుతుంది.భయాన్ని కలిగిస్తుంది.
 విషయం తెలిసిన వాళ్ళకి కర్ర మరియు బొమ్మలు వేరు వేరు కావని తెలుస్తాయి. ఆ బొమ్మల్లో కర్ర వుందనేది అర్థం అవుతుంది.భయపడే వారిని మాత్రం పులి, సింహం బొమ్మలు తమలో వున్న కర్రను దాచి జంతువులుగా భ్రమింప చేశాయన్న మాట.
 పై విషయాల ద్వారా  మనకు రెండు విషయాలు అవగతం  అవుతాయి.
 అవేమిటంటే ఆధ్యాత్మిక దృష్టి గలిగి బొమ్మల్లో కర్రను చూసినవారికి కర్ర,ఆ బొమ్మలు వేర్వేరు కావనీ, వాటిల్లో కర్ర అనేది పరమాత్మ  లాంటిదని. ఈ ప్రపంచం కూడా అంతేనని. అన్నింటిలోనూ పరమాత్మ అనే మూలం దాగి ఉందని తెలుస్తుంది.అలా వారికి ప్రపంచం ,పరమాత్మ  వేరు కాదు ఒకటే అనే గొప్ప సత్యం ఋజువవుతుంది.
ఇక కర్రను చూసి జంతువులుగానో, మనుషులుగానో భ్రమించే వారికి ఎల్లప్పుడూ అశాంతి, అభద్రతా భావం మనసును  వెంటాడుతుంటాయి. భయం భయంగా కాలాన్ని గడుపుతుంటారు.వారిలో జ్ఞానమనే వెలుగు రానంత వరకూ  వారు అలాగే వుంటారు.
మరి ఈ భయాలు,అభద్రతా భావాలు తొలగిపోవాలంటే గురువులో,పెద్దలో, హితైషులో ఎవరో ఒకరు వారిలో జ్ఞాన దీపాన్ని వెలిగించాలి. లేదా భయాన్ని పోగొట్టేందుకు వారిని ఋజువులు, నిరూపణకు సిద్ధం చేయాలి.అప్పుడే  వారిలోని చీకటి తొలగిపోయి వెలుగు క్రమంగా మనసులోకి ప్రవహిస్తుంది.ప్రసరిస్తుంది.
 ఈ "దారు పురుష న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే నిజం తెలియనంత కాలం, సత్యం గ్రహించనంత కాలం  మనపై భ్రమలు, భయాలు దాడి చేసి అశాంతికి గురి చేస్తాయి. వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే వుండాలి.అప్పుడే చీకటి నుండి వెలుగులోకి ప్రయాణం అలవోకగా చేయగలం. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోగలం.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం