బొర్ర కోతి బాల గేయం;- ఎడ్ల లక్ష్మి
బొర్ర కోతి వచ్చింది 
వెర్రీ చేష్టలు చేసింది
కర్ర చేత పట్టుకుని 
కరీమచటికి వచ్చాడు !!

తరిమి తరిమి కొట్టాడు 
తుర్రు మని ఊరికింది 
ఊరు వాడ దాటింది 
తురాయి చెట్టు ఎక్కింది !!

గిరగిర కొమ్మలు విరిసింది 
పరపర పూలు కొరికింది 
కర్రెగ మబ్బులు వచ్చాయి 
చెర చెరమని ఉరిమింది !!

మెరిసే మెరుపు చూసింది 
దారి కొరకది వెతికింది
బిర బిర చినుకులొచ్చాయి
బీరిపోయి కూర్చుంది !!


కామెంట్‌లు