ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో పోటీ పరీక్షలకు శిక్షణ; -హెచ్ఎం ఈర్ల సమ్మయ్య


 కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని పెంతాల అభిజ్ఞ  క్రీడా పాఠశాల ప్రవేశం కోసం జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలో  అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయింది. మంగళవారం ఊషన్నపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య స్థానిక స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సునీత చేతుల మీదుగా విద్యార్థినికి ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీని బహుకరించి, అభినందనలు తెలియజేశారు. రాష్ట్రస్థాయిలో కూడా విద్యార్థిని అత్యంత ప్రతిభ కనబరిచాలని, కాంప్లెక్స్ హెచ్ఎం సునీత, పాఠశాల హెచ్ఎం ఈర్ల సమ్మయ్య, అమృత సురేష్, పాఠశాల కమిటీ చైర్మన్ లు ఆకాంక్షించారు. ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి ఊషన్నపల్లి పాఠశాలకు బదిలీ అయిన ఈర్ల సమ్మయ్య మంగళవారం పాఠశాలలోని పిల్లలకు అరటిపళ్ళు, బిస్కెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పిల్లలే ప్రతిభావంతులని, ఊషన్నపల్లి పాఠశాలలో రెగ్యులర్ పాఠ్యాంశాలతో పాటు గురుకుల, నవోదయ, సైనిక్ స్కూల్ ప్రవేశం కోసం ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నామన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు పంపించే పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉషన్నపల్లి పాఠశాలలో చేర్పించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈర్ల సమ్మయ్య కోరారు. పెంతాల అభిజ్ఞ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు  ఎన్నికవడం పట్ల మండల విద్యాశాఖాధికారి టి. సురేందర్ కుమార్, ఎంఎన్ఓ సిరిమల్ల మహేష్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం నరెడ్ల సునీత, పాఠశాల హెచ్ఎం ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్, పీడీ కుమారస్వామి, విద్యా కమిటీ చైర్మన్, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని అభిజ్ఞకు అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు