నా కొత్తకోర్కెలు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
కొత్తగృహాన్ని
కట్టాలనియున్నది
కొత్తకాపురామును
పెట్టాలనియున్నది

కొత్తదారిని
పట్టాలనియున్నది
కొత్తచోటుకు
వెళ్ళాలనియున్నది

కొత్తవారిని
కలవాలనియున్నది
కొత్తగొంతులను
వినాలనియున్నది

కొత్తదేవుని
కొలవాలనియున్నది
కొత్తకోర్కెలను
కోరాలనియున్నది

కొత్తతీరులుని
తెలుపాలనియున్నది
కొత్తమార్గాలందు
నడిపించాలనియున్నది

కొత్తవింతని
చెప్పాలనియున్నది
కొత్తసౌందర్యాలను
చూపించాలనియున్నది

కొత్తరుచులను
అందించాలనియున్నది
కొత్తానుభూతులను
కలిగించాలనియున్నది

కొత్తలోకమందు
విహరించాలనియున్నది
కొత్తజీవితమును
గడపాలనియున్నది

కొత్తకవితలను
వ్రాయాలనియున్నది
కొత్తవిషయాలను
వెలువరించాలనియున్నది

కొత్తగా కొత్తకొత్తగా
కనిపించాలనియున్నది
కొత్తదనాలను
కొసిరివడ్డించాలనియున్నది

కొత్తబట్టలు
కట్టాలనియున్నది
కొత్తావతారము
ఎత్తాలనియున్నది

కొత్తదనాన్ని
ఆహ్వానిస్తారా
కొత్తతలపులను
ఆస్వాదిస్తారా


కామెంట్‌లు