శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )--ఎం. వి. ఉమాదేవి
991)క్షితీశః -
==========
భూమికి నాథుడైయున్నట్టివాడు 
ధరణికి ప్రభువుగా నున్నవాడు 
భూదేవిని పాలించుచున్నవాడు 
క్షితీశా నామము గలిగినవాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!
992)పాపనాశనః -

పాపాలు నశింపజేయగలవాడు 
తప్పులు తొలగించినట్టివాడు 
క్షమించు హృదయము గలవాడు 
పాప నాశనః నామమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
993)శంఖభృత్ -

పాంచజన్యమును పట్టినవాడు 
ధవళశంఖము చేబూనినవాడు 
శంఖచక్రధారి అయినవాడు 
శంఖ భృత్ యనెడి నామధేయుడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
994)నందకీ -

నందకమను ఖడ్గమున్నట్టివాడు 
కరవాలమును ధరించినవాడు 
శ్రీమహావిష్ణువు తానైనవాడు 
నందకీ నామమున్నట్టి వాడు 
 శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
995)చక్రీ -

సుదర్శనమును ధరించినవాడు 
చక్రాయుధపాణి అయినవాడు 
వైకుంఠములోని నారాయణుడు 
శ్రీహరి అవతారమునున్నవాడు 
శ్రీ విష్ణుసహస్ర నామాలు ఉమా!

(సశేషము )

కామెంట్‌లు