రోజూ
కవితాక్షీరాన్ని చిలుకుతున్నాను
కాస్తోకూస్తో
సాహిత్యామృతాన్ని వెలికితీస్తున్నాను
రోజూ
ఊహలను ఉల్లానపారిస్తున్నాను
ఏవో
విషయాలను వివరిస్తున్నాను
రోజూ
కలమును కరానపడుతున్నాను
ఏదో
భావమును బయటపెడుతున్నాను
రోజూ
అక్షరసేద్యము చేస్తున్నాను
ఎన్నో
సాహిత్యపంటలు పండిస్తున్నాను
రోజూ
పదపుష్పాలను సేకరిస్తున్నాను
ఎన్నో
కవనహారాలను గుచ్చుతున్నాను
రోజూ
అందాలను చూస్తున్నాను
ఏలనో
పుటలపైన పెడుతున్నాను
రోజూ
ఆనందాలను పంచుతున్నాను
ఎందరికో
మానసికతృప్తిని కలిగిస్తున్నాను
రోజూ
వాణీదేవిని పూజిస్తున్నాను
ఎన్నో
వరాలిమ్మని వేడుకుంటున్నాను
రోజూ
కవితను వ్రాస్తున్నాను
ఎన్నో
మదులను దోస్తున్నాను
రోజూ
కవితాయఙ్ఞము చేస్తున్నాను
ఏలనో
విరామము ఇవ్వలేకున్నాను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి