ప్రపంచంలోని అత్యంత పురాతనమైన సచిత్ర క్రిస్టియన్ బైబిలు వెలుగులోకి వచ్చింది. ఈ పవిత్ర గ్రంథాన్ని " గరిమా సువార్తలు " అని కూడా అంటారు. దీనిని ఒక మారుమూల ఇథియోపియన్ ఆశ్రమంలో కనుగొన్నారు. దీనిని బ్రిటీష్ స్వచ్ఛంద సంస్థ భద్రపరిచింది.
క్రీ.శ. 494లో కాన్‌స్టాంటినోపుల్ నుండి ఇథియోపియాకు వచ్చిన ఒక సాధువు పేరిట దీనిని "అబ్బా గరిమా" అని వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ సువార్తలను కేవలం ఒక రోజులో కాపీ చేసినట్లు చెబుతారు.
ఈ సచిత్ర సువార్తల గ్రంథాన్ని కొన్ని శతాబ్దాలుగా భద్రపరచిన ఇథియోపియన్ హెరిటేజ్ ఫండ్ కృషికి పలువురు ధన్యవాదాలు తెలిపారు.
టైగ్రే ప్రాంతంలో 7,000 అడుగుల ఎత్తులో ఉన్న అడ్వా సమీపంలోని గరిమా మొనాస్టరీలో భద్రపరచిన ఈ ప్రతిని వెలుగులోకి తీసుకురావడం ముదావహమని పలువురంటున్నారు.
ముస్లిం దండయాత్రలు, ఇటాలియన్ ఆక్రమణ, 1930 లలో విధ్వంసక అగ్నిప్రమాదంతో ఫవిత్ర చర్చి దెబ్బతిన్నప్పటికీ పురాతన ఇథియోపియన్ భాష " గీజ్ "లో మేక చర్మంపై వ్రాయబడిన ఈ పురాతన గ్రంథం ప్రారంభ క్రైస్తవ మాన్యుస్క్రిప్ట్ సంప్రదాయానికి (ఆఫ్రికా) ముఖ్యమైన సాక్ష్యంగా నిలవడం విశేషం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి