గురుశిష్య బంధం;- - జయా
 ఇక్కడ ఫోటోలో మీరు చూస్తున్నావిడ కేరళ రాష్ట్రంలోని మల్లపురంలో ఓ స్కూల్లో లెక్కలు టీచరుగా పని చేసినవారు. ఆవిడ స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మూల కూర్చుని అడుక్కునేవారు.
అయితే ఆవిడ దగ్గర చిన్నప్పుడు చదువుకున్న ఒకరు ఓరోజు ఆవిడను గుర్తు పట్టారు. కానీ ఆవిడ ఆ విద్యార్థినిని గుర్తుపట్టలేదు.
ఆవిడకు నమస్కరించిన ఆ విద్యార్థిని తాను చదువుకున్న రోజులను గుర్తు చేసారు. అలాగా...బాగున్నావా అంటూ ఆవిడ తాను రిటైరయ్యాక తాననుకున్న పరిస్థితులన్నీ తల్లకిందులయ్యాయి. నా పిల్లలు నన్ను నిర్లక్ష్యం చేసి నన్నొదిలి వెళ్ళిపోయారమ్మా... అందువల్లే ఈ రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కుంటున్నాను అని తన దీనస్థితిని చెప్పుకున్నారు. 
ఆ మాటలకు విద్యార్థిని తెగ బాధ పడింది. కంట తడిపెట్టింది.. టీచర్ని తన ఇంటికి తీసుకువెళ్ళింది. మంచి బట్టలు ఇచ్చి అన్నం పెట్టింది. అనంతరం ఆ విద్యార్థిని తనతో చదువుకునున్న మరికొందరు స్నేహితులను కలిసి టీచర్  స్థితి గురించి చెప్పింది. విద్యార్థులందరూ  కూడబలుక్కుని తమ లెక్కలు టీచర్ క్షేమంగా బతకడానికి తగిన ఏర్పాట్లు చేశారు.
ఆవిడ సొంత పిల్లలు ఆవిడను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆమె దగ్గర చదువుకున్న పిల్లలు ఆవిడను వదులుకోలేదు.
అదే గురుశిష్యుల మధ్య ఉన్న మహత్తు.

-

కామెంట్‌లు