ఊషన్నపల్లి పాఠశాలలో మొక్కలు నాటిన చిన్నారులు

  శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లిలోని ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలు మంగళవారం పాఠశాలలో మొక్కలు నాటారు. ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య స్థానిక నర్సరీ నుంచి అయిదారు రకాల మొక్కలను తెప్పించడంతో పిల్లలు వాటిని పాఠశాల ఆవరణలో నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ చెట్ల వల్ల మనకు చాలా ఉపయోగాలున్నాయని, చెట్లు ప్రాణవాయువునిచ్చి, మనకు హానిచేసే కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకుంటాయన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ స్కూల్లోనే కాకుండా తమ ఇంటి పరిసర ప్రాంతాల్లోని ఖాళీస్థలాల్లో కనీసం 50 నుంచి 100 చెట్లు నాటి, వాటిని సంరక్షించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్, అటెండర్ లింగయ్య, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు