నవ్వు చేసే మేలు ;- ----చంద్రకళ
నవ్వుచేసే మేలు ఎవ్వరూ చెయ్యలేరు!
నవ్వుతో కష్టాలన్నీ మాయం! 

చిరునవ్వుకు వెల ఏముంది? 
నవ్వితే పోయేదేముంది మనసులోని బాధలు తొలగిపోడం తప్ప 

నవ్వుకు జవాబు నవ్వేగా 
ఆ నవ్వులో ఎంత ఆనందం 
ఆమోములో ఎంతప్రశాంతత 

కష్టాలకడలి దాటి ఒడ్డు చేరినట్లు
ఏదో అద్భుతాన్ని చూసినట్లు 
ప్రపంచాన్ని గెలిచినట్లు 

శాంతి మంత్రమేదొ విన్నట్లు 
అన్యాయాన్ని గెలిచినట్లు 
మనసారా నవ్వితే ముత్యాలే రాలినట్లు
 
 నవ్వలేరు జనం పోసినానిలువెత్తుధనం 
చిరునవ్వు ఆరోగ్యానికి చిహ్నం 
దొరికేను విరోధం లేనిస్నేహం 

నవ్వుతో అందరూ మిత్రులే 
ఇక శత్రుత్వానికి చోటేది 
నవ్వేవాళ్ళనిచూసి కుళ్ళేమనస్తత్వం  లోపమే 

నవ్వలేక పోవడం పెద్దరోగమే 
నవ్వగలగడం భోగమే 
నవ్వించడం గొప్ప యోగమే 

నవ్వుతో పోయేది శోకమే 
నవ్వితే ఈనేల  నాకమే 
నవ్వలేని నాడు నరకమే 
***


కామెంట్‌లు