సుప్రభాత కవిత ; -బృంద
మాయ  ఎంతగా కమ్ముకుందో
మమతలంతగా పెంచుకోడం
మనిషి బ్రతుకున మారలేని
భ్రాంతితోటే జీవితాలు

చేయని నేరాలకు శిక్షలు
వీడని బంధాల చెరలు
ఆరాటాల పోరాటాలు
అలుపెరుగని పయనాలు..

మోయలేని భారపు ముడులు
వేయలేని మది గడియలు
రాయబడిన నుదుటిరాతలు
దాయలేని అభిమానాలు

చిక్కుముళ్ళ జీవితాలకు
పెక్కు కమ్మని ఆశలిచ్చి
అక్కున చేర్చి ఆదరించి
మక్కువతో చేయందించి

దశ మారే దోవ చూపి
దిశా నిర్దేశము చేసి
నిశి దాటిన ఉషస్సుగా
శశి కాంతుల చలువనిచ్చే

వెలుగుల వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు