నమ్ము నమ్మకపో! అచ్యుతుని రాజ్యశ్రీ
 కొన్ని యథార్థాలు విన్నా చదివినా నమ్మలేం.వాస్తవం కాదు అనుకుంటాం.రుడ్ యార్డ్ కిప్లింగ్ తన" జంగిల్ బుక్ " లోఅడవి జంతువుల చేత పెంచబడిన బాలుడికథ రాశాడు.సాధారణంగా తోడే లు  ఇలా మనిషి పిల్లల ని  ఎత్తుకుపోయి పెంచిన ఆధారాలున్నాయి.అమల కమల అనే ఆడపిల్లలను తోడేళ్లు పెంచాయి.మనదేశంలో మిడ్నపూర్ అటవీప్రాంతంలో దొరికారు వారు. తమ పిల్లల తో ఈఇద్దరు బాలికల ను తోడేళ్లు పెంచడంతో వారి నడవడి ప్రవర్తన అంతా తోడే ళ్లు గానే ఉండిపోవటం ఆనాడు దేశంలో సంచలనం సృష్టించింది. ఒక చర్చి ప్రీస్ట్ కంట పడినవీరిని అనాథాశ్రమంలో ఉంచారు. అమల కొద్దిరోజులకే చనిపోయింది. కానీ కమల16ఏళ్లు బతికి మనిషి లాగా నడవటం మన భోజనం తినటం కొన్ని పదాలు పలకడం నేర్చుకుంది. 1973 లో శ్రీలంకలో టిస్సా అనే తోడేలు పెంచినబాలుడు అడవిలో దొరికాడు.ఎలుగుబంటి తోడేలు మనిషి పిల్లలని సాకటం నమ్మలేని నిజం!!
కొన్ని ఆఫ్రికన్ కరీబియన్ మతాల ప్రకారం జోంబీ అనే చనిపోయిన వ్యక్తి ని మాంత్రికుడు బతికించి తన బానిసగా మారుస్తాడు.    ఈజోంబీలు మనిషి లాగా ఊపిరి పీలుస్తూ ఆహారం తింటూ కదులుతూ ఉంటాయి. కానీ స్వతంత్రం గా ఆలోచించలేవు.భయంకరమైన అరుపులు మనకు వినపడతాయి.1980 లో ఒక స్త్రీ  అలా ఊరికే తిరిగేదిట పల్లెలో.ఆమె 1966 లో చనిపోయింది. హైతీ ప్రాంతం లో ఆడజోంబీ  నడిచే కొయ్యబొమ్మలా సంచరించడం చాలా మంది చూశారు. ఫెలీషియా అనే తన కూతురు చనిపోతే1907లో సమాధి చేశానని ఆమె తండ్రి చెప్పాడు.మన దేశంలో కూడా దెయ్యం ప్రేతాత్మలు  ఉన్నాయి అని తమ కుటుంబంపై మమకారం ప్రేమ చంపుకోలేక ఆపరిసరాల్లో తిరుగుతూనే ఉంటాయి అని ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు. ఇలా భయపెట్టి డబ్బు గుంజే మోసగాళ్ళు న్నారు.శాస్త్రవేత్తలు మాత్రం  జోంబీలు అనేది కట్టుకథ అని కొట్టి పారేశారు. 🌹

కామెంట్‌లు