స్నేహం! అచ్యుతుని రాజ్యశ్రీ

 పిల్లలకు  కథలుగా ప్రతిదీ చెప్పాలి.నెగెటివ్ గా "కాదు వద్దు  లేదు " అని చెప్పకూడదు. పూలనుంచి వచ్చే కమ్మని పరిమళం లా ఉండాలి. అంతేకాని చెత్త కుప్పలనుంచి వచ్చే గాలిని అసహ్యించుకుంటాం.మంచి పిల్లల తో స్నేహంతో మనం బాగా చదువుతాం.చెడ్డవాడితో స్నేహంతో నేడు ఈసిగరెట్లు మద్యం డ్రగ్స్ కి బానిసలై దొంగలుగా ఖూనీకోర్లు గా మారుతున్నారు.నీటిలో  నూనెపడితే కలవదు.   అలా వారి కి  చెడు అంటదు.వాలి రావణుడి తో స్నేహంచేసి రాముని చేతిలో చచ్చాడు.సుగ్రీవుడికి హనుమంతుడు అండదండలు ఇచ్చాడు.పైగా రాముని స్నేహం తో రాజైనాడు.ఇలాంటి విషయాలు కథలుగా చెప్పాలికానీ నీతిబోధలతో" వారి తో మాట్లాడకు." అని చెప్పితే  పిల్లల లో నకారాత్మక భావాలు నాటరాదు. అందుకే  రామాయణం భారతాలు కథలు చెప్పాలి. నేడు బైక్ లపై టీనేజ్ పిల్లలతో ప్రమాదాలు ఎక్కువ. గమనించి బడిలో కాలేజీ లో మనం ఎంక్వయిరీ చేయటం మనధర్మం🌷
కామెంట్‌లు