విశ్వామిత్రుడు! అచ్యుతుని రాజ్యశ్రీ

 రామాయణం అంతా దాదాపు విశ్వామిత్రుడు వలనే నడిచింది.సీతాకల్యాణం కాగానే ఆయన కర్తవ్యం పూర్తి ఐందని పిస్తుంది.ఎంతో అహంభావం అహంకారం కోపిష్టి ఐన ఆయన రోషం పట్టుదలతో
బ్రహ్మర్షి కాగలిగాడు.వసిష్ఠుని చేత అలా పిలవబడ్డాకే
సంతృప్తి పొందాడు.సుక్షత్రియవంశంలో గాధి కుమారుడు గా జన్మించిన ఆయన మహారాజు గా వశిష్ఠుని ఆశ్రమం లో ప్రవేశించాడు.మొదట సాత్మీకంగా ఉన్న ఆయన లోభగుణంతో శబల గోవుని ఇవ్వమంటే నిరాకరించారుహర్షి.అంతే క్రోధం అహంకారం తో ఆగోవుని ఈడ్చుకుంటూ తీసుకుని వెళ్లారు అతని సైన్యం.పాపం శబల తప్పించుకుని మహర్షి దగ్గరకు వచ్చి " నన్ను ఆదుర్మార్గుడైన రాజు దగ్గరకు ఎందుకు పంపావు? నన్ను నేనే రక్షించుకోనా అని అడిగింది.వశిష్ఠమహర్షి అన్నాడు" రాజు విష్ణుసంభూతుడు.అతని నేరం అతన్ని కాలుస్తుంది.
నిన్ను నీవే కాపాడుకో!" అంతే శబలలోంచిసైన్యం బైటకి వచ్చి విశ్వామిత్రుడిసైన్యం ని చిత్తు చేసింది.అతని 100 మంది కొడుకులు భస్మమైనారు.
రాచరికం కన్నా తపశ్శక్తి గొప్పదని గ్రహించి పట్టుదలతో తపస్సు చేసి బ్రహ్మ చేత రాజర్షి అనిపించుకున్నా అసంతృప్తితో ఉంటూ త్రిశంకుని
స్వర్గానికి పంపాలని ప్రయత్నించి విఫలుడైనాడు.కడుపులో కోరిక ఏమంటే వశిష్ఠుడు చేయలేనిది తాను చేసి తీరాలని!కానీ అందులో విఫలుడై పడమటి దిక్కు అయోధ్య కెళ్ళాడు.దాన్నిఅంబరీషుడు పాలిస్తున్నాడు.అతను అశ్వమేధ యాగం కోసం శునశ్శేపుడు అనే ముని బాలకుని బలి ఇవ్వబోతున్నాడు అని తెలిసి ఆపిల్లాడికి రెండు మంత్రాలు ఉపదేశించాడు.ఇంద్రుడు సంతోషంగా రాజుకి కోటిరెట్ల ఫలం ఇచ్చాడు.
ఇక మళ్లీ వెయ్యేళ్ళ తపస్సు చేశాడు.కానీమేనక మోహంలో పడి ఉన్న తపశ్శక్తి పోయినందుకు బాధపడ్డాడు.10 ఏళ్ళు మేనకతో సుఖించి శకుంతల కు తండ్రి ఐనాడు. విరక్తితో మళ్ళీ తపస్సు చేశాడు.బ్రహ్మ మహర్షి అని పిల్చాడు.తను జితేంద్రియుడు కాలేదు అని తెలిసి మళ్ళీ వెయ్యేళ్ల తపస్సు చేయడం ఇంద్రుని ఆనతో‌రంభ తపస్సు ని
భగ్నం చేయడంతో కామం పోయి క్రోధం వచ్చింది.రంభని రాయిగా మారమని శపించాడు.
ఆఖరుకు వశిష్ఠుడు వచ్చి బ్రహ్మర్షీ అని పిలిచే దాకా
పట్టువిడవలేదు.అలా కామక్రోధాదులను జయించి
రామాయణం బాలకాండ మొదలు సీతాస్వయంవరందాకా రకరకాల కథలు ధర్మం చెప్తూ
ఆదర్శ గురువు ఐనాడు విశ్వామిత్రుడు 
కామెంట్‌లు