రక్త హీనత నివారణ మనందరి ధ్యేయం

 విద్యార్థుల్లో రక్తహీనతను అధిగమించి ఆరోగ్యంగా ఉండటానికి ఈ ఐ ఎఫ్ ఎ టాబ్లెట్స్  ఎంతగానో దోహదపడుతాయని కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు అన్నారు. పాఠశాలలో ప్రతి గురువారం సుమారు నూట ఎనభై మంది బాలబాలికలకు ఈ టాబ్లెట్స్ ను వైద్యశాఖ ద్వారా అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. 
కురిగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కడుము సబ్ సెంటర్ సి హెచ్ ఓ, ఎంఎల్ హెచ్ పి వైద్యురాలు వై.విమలాదేవి ఆధ్వర్యంలో టాబ్లెట్స్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో విమలాదేవి విద్యార్థులనుద్దేశించి ఆరోగ్య సూత్రాలు వివరించారు. 
ఈ మాత్రలు అలసట లేకుండా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడతాయని అన్నారు. నీరసం, నిస్సత్తువ రాకుండా చేస్తాయని, జీర్ణశక్తి మెరుగవుతుందని ఆమె అన్నారు. ఈనాటి ఆరోగ్య తనిఖీలో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్ ఎం.సరస్వతి, ఆశ కార్యకర్తలు ఆర్.సరోజని, డి.సరోజని తదితరులు పాల్గొని సహకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, దార జ్యోతి, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, శివకల శ్రీవాణి, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, కింజరాపు నిర్మలాదేవి, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, గుంటు చంద్రం, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణ పాల్గొన్నారు.
కామెంట్‌లు