రామాయణం లో రాక్షసులు! అచ్యుతుని రాజ్యశ్రీ

 రామలక్ష్మణులు మొత్తం ముగ్గురు ఆడరాక్షసులకు ముక్కు చెవులు కోసి పంపారు. తాటకిమొదటిది చంపారు. రెండోది శూర్పణఖ  రావణుడి చెల్లి.ప్రతివారూ అడుగు తారుకదా" నీకు ముక్కు చెవులు ఎలా పోయాయి?" అని. అందవికారంగా ఐనాను అనేబాధతో వారి లో కామవికారం నశిస్తుంది. తను చేసిన తప్పు పని హమేషా గుర్తు చేస్తూ ఉంటుంది. మూడో ఆడరాక్షసి అయోముఖి.దాని స్తనాలు కూడా కోసేశారు.   చంపకుండా వదిలిపెట్టడం లో అంతరార్థం ఎవరుచేసిన తప్పు వారికి  సదా గుర్తు ఉంటూ ఇతరులు తప్పు చేయకుండా  చూడటమే! 
ఇకవిచిత్ర రాక్షసుడు కబంధుడు.కాళ్ళు లేని గుండె నించి నడుంవరకే ఉండి అగ్ని లామండే ఒంటికన్ను రక్కసుడు.వాడు చేతులు బాగా పొడుగ్గా బారజాపి చేతికందినవారిని లాగి నోట్లో పెట్టుకుని హాంఫట్ చేసేవాడు. రామలక్ష్మణులు వాడి రెండు చేతులు నరికేశారు." నన్ను చితిలోవేసి దహనం చేయండి " అని వారి ని కోరి తన కథ చెప్తాను అన్నాడు. అలా చితిలోంచి బైట కి వచ్చి తన కథ చెప్పాడు" నేను గొప్ప బలపరాక్రమం గలవాడిని.మంచి తేజస్సు ఉన్న నేను విచిత్రమైన రూపాలతో అడవిలోకి వెళ్లి అందరినీ భయపెట్టేవాడిని.సూత్రధారుడు అనే ఋషి నన్ను శపించాడు. రామలక్ష్మణులు నీచేతులు ఖండిస్తే శాపవిముక్తి కలుగుతుంది అని చెప్పాడు." మనిషి తన అందం బలం చూసి గర్వంగా ఇతరులను  బాధపెట్టరాదని వీరి జీవితం వల్ల మనకు తెలుస్తుంది 🌹
కామెంట్‌లు