నీ కన్రెప్పల చప్పుడు
నా మదినే తడుతూవుంటే
నీ పెదవుల కదలిక
నా హృదినే తడుముతూవుంటే
నీ చక్కని సింగారాలు
నా చూపును లాగుతూవుంటే
కనులు తెరిచినా కనులు మూసినా
నీ రూపే నా కలవరమైతే
ఎదురుచూడనా నీకోసం
తపసినికానా నీకోసం!!
**************************************
కలవరం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి