సుప్రభాత కవిత ; -బృంద
తరలిపోవును చీకటి నీడలు
మరలి తీరును నలతల పాట్లు
దొరలిపోవును కష్టకాలము
విరిసి మురియును చిన్ని హృదయము!


నివురును తొలగించి
చిన్ని మొలకతొంగిచూసె
ఎన్ని ఆశలు చివురులు తొడిగెనో
ఇన్ని దినముల నిద్రమేల్కొని.

తపనతో ఎదురుచూసిన
తలిరాకుల గలగల విని
తరువెంత మురిసెనో
బరువేదో దిగిపోయెనని....

అడుగున దాచిన చెమ్మలన్నీ
మదిని తడుపగా పరవశించి
తధికన్నులతో గలగల నవ్వగా
తళుకు బుగ్గల మెరిసిపోయెను

ఓర్పుకు చక్కని ఊరటనిచ్చి
మార్పుల రేపుకు పట్టము కట్టి
బ్రతుకున కొత్త వెలుగేదో తెస్తూ
పసిడికాంతుల పంచే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు