ఏ రోజు కా రోజు!!!;-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
పేదవాళ్లు ఎంత కష్టాన్నైనా చేస్తారు. 
ఎంత కష్టమైనా భరిస్తారు 
కానీ 
అంతా మర్చిపోయి 
ఆనందంగా ఉంటారు. 
వాళ్లలో ఆందోళన కనపడదు. 
ఏరోజు కారోజు  జీవిస్తారు.!!!?

అవయవాలు లేకపోతే 
అంగవైకల్యం వస్తుందేమో 
కానీ 
కడు పేదరికం 
మానసిక వైకల్యాన్ని తెస్తుంది.!

సంతోషంలో ఉన్నవాడు 
దుఃఖాన్ని ప్రేమిస్తాడు 
దుఃఖాన్ని మరిచిపోడు. 
దుఃఖంలో ఉన్న వాడు 
దుఃఖాన్ని ద్వేషిస్తాడు. 
దుఃఖాన్ని మరిచిపోతాడు.!!?

రహస్యంగా నిగూఢంగా మర్మంగా జీవించటం ఒక మూఢనమ్మకం. 

రహస్యాన్ని ఛేదించడం 
నిగూడం గురించి వివరించటం 
మర్మం గురించి మాట్లాడటమే 
నిజమైన శాస్త్రీయ లోకం.!!!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ మండలం బిజ్నాపల్లీ నాగర్ కర్నూల్ జిల్లా 🙏🙏

కామెంట్‌లు