పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ జన్మదినాన : ఆధ్యాత్మిక సాహిత్యవేత్త "కావ్యసుధ " కు ఘనసన్మానం
  శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ కులపతి, విశ్రాంత ఆచార్యులు శ్రీ కొలకలూరి ఇనాక్ 86వ జన్మదిన వేడుకలు 
మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ, భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో, హైదరాబాద్ నారాయణగూడ  తాజ్ మహల్ హోటల్ లో 
వాల్మీకి సంస్థ అధ్యక్షులు డాక్టర్. వి. డి.రాజగోపాల్ అధ్యక్షతన ఘనంగా జరిగిన 
ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా  సినీ నిర్మాత, కంఠమనేని రవిశంకర్, గౌరవ అతిథిగా విమర్శకులు, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
 ఈ కార్యక్రమంలో కొలకలూరి ఇనాక్ సాహిత్యం పై కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ, ఆర్ ఎన్ ఐ  డాక్టర్ జల్దీ విద్యాధర్, డాక్టర్ భారతి, డాక్టర్ రాధాకుసుమ, మరియు అనువాదకుడు శ్రీనివాస్ గౌడ్ తూలనాత్మకంగా ప్రసంగించారు.
డాక్టర్ రవీంద్రబాబు అరవా  సమన్వయకర్తగా ఏర్పాటు చేసిన ' గురుదేవోభవ' అనే అంశంపై కవి సమ్మేళనాన్ని నిర్వహించగా ఆధ్యాత్మిక సాహితీవేత్త "కావ్యసుధ " గురువు అంటే... " అనే కవితను వినిపించారు.
డాక్టర్ వి.డి.రాజగోపాల్, కళారత్న బిక్కి కృష్ణ, పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ గారిచే జ్ఞాపిక, శాలువాతో " ఆధ్యాత్మిక సాహితీ సామ్రాట్" "కావ్యసుధ " ఘనంగా సన్మానం పొందారు.
తనను సన్మానించిన సన్మాన కర్తలకు  కృతజ్ఞతలు తెలియ చేస్తూ... జన్మదిన సందర్భముగా  ఆచార్య కొలకలూరి ఇనాక్ గారిని ఆధ్యాత్మిక వ్యాస రచయిత  'కావ్యసుధ' ఘనంగా సన్మానించారు.
వివిధ రంగాలలో కృషి చేస్తున్న  ప్రముఖులు ఈ సభలోనే కొలకలూరి ఇనాక్ జాతీయ సాహిత్య పురస్కారాలు అందుకున్నారు

కామెంట్‌లు