'కృష్ణా!'శతకము.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయబడినది 
===========================================
క్రొత్త వృత్తములు.
-----------------------
6.
విరాజికరా -జ, య, గ గ.
ప్రభాసితమౌనీ మోమున్
బ్రభాతమునందున్ గాంచన్
శుభంబులు కల్గున్ శౌరీ!
ప్రభాతివి నీవే కృష్ణా!.//

7.
భారంగీ -జ,స,గ ,గ.
మురారి!చిరదోషంబుల్ 
చరిత్ర వినగా కాలున్
నిరంతరము నిన్ దల్తున్
స్థిరాత్మగ మదిన్ కృష్ణా!//
8.
సారవదనా -త,జ, గ, గ.
ఓ పాప వినాశ!రావా!
నీ పాదము పట్టితిన్ నా
శాపాలను ద్రుంచ వయ్యా!
తాపత్రయ దూర!కృష్ణా!//
9.
. కరాళీ -త,త, గ, గ.
శ్రీవేంకటేశా!మురారీ!
భవాంబుధిన్ దాటుదారిన్
నీవే కటాక్షింపుమయ్యా!
సేవింతు నిన్నెప్డు కృష్ణా!//
10.
సంధ్యా -త,న,గ,గ.
మోహంబు దొలగగా దా
సోహంబని వినతిన్ సం
దేహంబు విడిచి దల్తున్
జోహారనుచును కృష్ణా!//

కామెంట్‌లు