వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,-కుంచన పల్లి.
 ప్రహ్లాదుడు లాంటి వాడికి చిన్నతనంలోనే భక్తి ప్రారంభం అవుతుంది  చాలామందికి జీవిత చరమాంకలో కానీ ఆ భక్తి చేయాలన్న ఆలోచన రాదు  మనం వెదురు కర్రలను  ఇల్లు కట్టడానికి వాడుతూ ఉంటాం  అదే అడవిలో వారు  వంట చెరుకుగా వాడతారు ఆ వంట చెరుకుగా వాడే  వెదురు కలపను ఊదుతూ ఉండాలి  లేకపోతే ఆరిపోతుంది  అలాగే భగవంతునిపై దృష్టి నిలిపి పంచేంద్రియాలను  తన స్వాధీనం చేసుకుని  మనసును నిలకడగా ఉంచుకొని  ప్రతి సాధకుడు కూడా దాని పైనే  కేంద్రీకరించి నిజాయితీతో  ఆధ్యాత్మిక అగ్నిని ప్రజలింప చేస్తూ ఉంటే తప్ప  నిరంతర సాధన ఉంటే తప్ప  భగవంతుడు తనకు కనిపించడు ముక్తి ప్రసాదించడు  అని వేదాంత విదులు చెబుతూ ఉంటారు.
మానవజాతికి చెట్లు చేసినంత సేవ మరెవరు చేయలేరు  దాని పండ్లు  ఆకులు  చెట్టు ఎండిపోయిన తర్వాత  అది కలపగా కూడా మనకు ఉపయోగపడుతుంది  అలాగే మనం మేడి పండ్లను చూస్తూ ఉంటాం  అది ఎందుకు పనికి వస్తుందో మనకు తెలియదు  ఆ పళ్ళను ముక్కలుగా చేసి ఎండబెట్టి నిలువ చేసుకోవాలి నెలకు ఒకసారి కొంత మొత్తం తీసుకుని దంచి పొడి చేసి జల్లించి  తూకం వేసుకోవాలి తూకం వేయడానికి కారణం దానితో సరి సమానమైన మోతాదులో పటిక బెల్లం పొడి కూడా కలపటం కోసం  ఆ రెండు సమపాళ్లలో ఉన్న తర్వాత  ఆ రెండు పొడులను కలిపి నిలువ చేసుకోవాలి  ఆ మిశ్రమాన్ని రోజు ఉదయం సాయంత్రం ఒక అర చెంచా చొప్పున  తీసుకోవాలి  శరీరానికి అది చేసే మంచి ఏ పండు చేయదు.జీవితంలో ప్రతి మనిషికి అహంకారం ఉంటుంది ప్రాణులను మించిన వారు ఎవరూ లేరు అదే గొప్ప అని అనుకుంటాడు  ఇది ఒక మనుషుల మనస్తత్వమే కాదు చెట్ల ఆకులకు కూడా ఈ జబ్బు ఉంది  మామిడి ఆకు ప్రతి శుభకార్యం లోనూ  తప్పకుండా ఉంటుంది  అది లేకపోతే ఏ శుభకార్యం జరగదు  ఆ విషయాన్ని అది ఎంతో గర్వంగా చెప్పుకుంటుంది  అది విన్న భగవంతుడు చిన్నగా నవ్వి తలుపు గుమ్మానికి తలక్రిందులుగా వేలాడే శిక్షను విధించాడు  కరివేపాకు గర్వం ఎలా ఉంటుందో చూడండి వంటలలో నేను లేనిదే రుచి లేదు అని గర్వంగా చెప్పుకుంటుంది  నిజానికి ఆ కరివేపాకు ఆరోగ్యాన్ని కూడా కలగజేస్తుంది కానీ దాని గర్వాన్ని అణచటానికి తినేటప్పుడు కరివేపాకుని పారవేసే ఆలోచనలు మనిషికి కలిగించిన వాడు భగవంతుడు.
----------------------------------------
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు