ఆకాశం
అందాలనుచూపింది
ఆనందం
అందరికీచేర్చింది
చందమామా రావే
అని మదిపిలిచింది
రమ్మన్నారనుకొని గగనమే
క్రిందకు కదిలింది
సత్వరం
బయలుదేరింది
గాలివేగం
పుంజుకుంది
వడగళ్ళు
టపటపారాల్చింది
చినుకులను
చిటపటాచల్లింది
రాళ్ళునీళ్ళు
విసిరింది
చల్లగాలులు
తోలింది
వెన్నెలను
వెదజల్లింది
తళుకులను
చిమ్మింది
కిరణాలను
కురిపించింది
చీకట్లను
తరిమివేసింది
మేఘాలను
అరిపించింది
మెరుపులను
మెరిపించింది
నీలిరంగు
పులుముకున్నది
నేత్రాలను
పరవశపరచింది
ఇంద్రధనుస్సు
వెలిసింది
ధరణి
మురిసింది
ఆకాశం
దిగివచ్చింది
అంతరంగం
ఎగిరిగంతులేసింది
భావకవిత్వానికి
బంధాలులేవని తెలిసింది
బహిరంగపరచటానికి
భ్రమలుచాలునని తేలింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి