తాతకు ముద్దులు ;- ఎడ్ల లక్ష్మి
మల్లయ్య తాత వచ్చాడు 
పల్లి పట్టీలు తెచ్చాడు 
కంచములోనా పెట్టాడు 
చెల్లె చేతికి ఇచ్చాడు !!

గబగబా చెల్లి వచ్చింది 
పల్లి పట్టీలు తీసింది 
తలా ఒక్కటి ఇచ్చింది 
మెల్లగా మేము తిన్నాము !!

తాత చుట్టూ మూగాము 
తాతకు బూరెలు ఇచ్చాము 
బూరెలు తింటూ మా తాత 
గారడి చేసి చూపాడు !!

గారడి చూసి మేమంతా
తాత చుట్టు తిరుగుతూ 
ముంతెడు పాలుతాపాము 
ముద్దులు పెట్టి వచ్చాము !!


కామెంట్‌లు