నేస్తాలు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 అశాంతిలో ఉన్నప్పుడు 
ఓదార్పునిచ్చేది
దుఃఖంలో ఉన్నప్పుడు
కన్నీళ్ళు తుడిచేది
నిరాశ పడుతున్నప్పుడు 
ఆశను రేకెత్తించేది 
ఓడిపోతున్నప్పుడు
"నువ్వు గెలుస్తావు" అని
నమ్మకాన్ని కలిగించేది
బాధ పడుతున్నప్పుడు 
ఆ బాధను పంచుకునే ప్రయత్నం చేసేది
అస్తవ్యస్త పరిస్థితులు వచ్చినప్పుడు 
ప్రోత్సాహాన్ని ఇచ్చేది 
ఆనందాన్ని ద్విగుణికృతం చేసేది
కష్టాన్ని సగం చేసేది 
నేస్తాలేకదూ!!
**************************************

కామెంట్‌లు