అవసరం!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
మానవ సంబంధాలకు మూలం 
మానవత్వం కావచ్చు!!!

మానవ సంబంధాలన్నీ 
ఆర్థిక సంబంధాలే కావచ్చు!!!

మానవ సంబంధాలన్నీ 
వ్యాపార సంబంధాలే కావచ్చు!!
కానీ 
మానవ సంబంధాలకు మూలం 
"అవసరం" !!!
మానవ సంబంధాలన్నీ 
అవసరం కోసమే!!!

ఉపయోగము లేనిది ఏది 
అవసరం లేనిది ఏది 
ప్రకృతి ఎన్నుకోదు!!!!!!!!!?

అవసరం ఉన్నది ముందు తరాలకు 
కొనసాగుతుంది!!!.
జీవ పరిణామమంతా ఇంతే 
మానవ మనుగుడంతా ఇంతే!!!

మానవ సంబంధాలన్నీ 
అవసరం కోసమే పుడతాయి.!!!

అది ప్రేమైన   స్నేహమైనా ఏ బంధమైన!!!!!!!!!!!!!!!!!!!!!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ బిజినేపల్లి మండలం.

కామెంట్‌లు