నాకోసమే;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 వేలవేల వసంతాలు వొలికినట్లుగా 
చల్లచల్లని వెన్నెల చల్లిపోయినట్లుగా
గుండెలో శ్రుతిలయలు కులికినట్లుగా 
పెదాలపై దరహాసం శాశ్వతంగా నిలిచినట్లుగా
యెదలోతుల్లో ఏదో ఆనందం పుట్టినట్లుగా
అంతరాంతరాలకు ఆత్మీయతను అందిస్తూ
నాకోసమే నీవు రావాలి!
మిత్రమా! నాకోసమే నీవు రావాలి!
కేవలం నాకోసమే సుమా!!
**************************************

కామెంట్‌లు