ట్రిపుల్ ఐటీ కి లావణ్య ఎంపిక

కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిణి కిల్లారి లావణ్య ట్రిపుల్ ఐటీ కి ఎంపికై తమకెంతో గర్వకారణంగా నిలిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు తెలిపారు. నేటి ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో ఒంగోలు క్యాంపస్ లో ప్రవేశానికి అర్హత సాధించుట పట్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, గ్రామపెద్దలు హర్షం వ్యక్తం చేసారు. గత ఏప్రిల్ నెలలో విడుదలైన పదోతరగతి ఫలితాల్లో లావణ్య 566 మార్కులు సాధించుకొని తన ప్రతిభను చాటుకుంది. ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు, ఉపాధ్యాయులు తూతిక సురేష్, పెయ్యల రాజశేఖరం, బండారు గాయత్రి, వల్లూరు లక్ష్మునాయుడు, బత్తుల వినీల, పడాల సునీల్, జన్ని చిన్నయ్య, కుదమ తిరుమలరావు, ముదిల శంకరరావు, బోనెల కిరణ్ కుమార్, గేదెల వెంకట భాస్కరరావు, యందవ నరేంద్ర కుమార్, రబికుమార్ మహాపాత్రో, సస్మితా పాఢి, సింగంశెట్టి మురళీకృష్ణలు లావణ్యను అభినందించారు.
కామెంట్‌లు