అంత మంది పిల్లలు!!;- - యామిజాల జగదీశ్
 ఒకే తల్లికి అత్యధికంగా అరవై తొమ్మిది మంది పిల్లలు జన్మించారు. ఇంతమంది పిల్లల రికార్డు రష్యాలోని షుయాకు చెందిన రైతు ఫియోడర్ వాసిలీవ్ (1707-1782) భార్య వాలెంటినా వాసిలీవాకు చెందినదే. వాలెంటినాకు మొత్తం 27 సార్లు గర్భం దాల్చారు. వారిలో పదహారు కాన్పులలో కవలలు పుట్టారు. 7 కాన్పులలో ముగ్గురేసి పుట్టగా 4 కాన్పులలో నలుగురు చొప్పున పుట్టారు. ఫియోడర్ వాసిలీవ్  కు ఇద్దరు భార్యలు. 
అతని మొదటి భార్య, వాలెంటినా వాసిలీవా అయితే, ఈ దంపతులకు పుట్టిన వారి పేర్లు, పుట్టిన తేదీలు, మరణించిన తేదీలు ఇతరత్రా వివరాలేవీ నమోదు కాలేదు.
వాసిలీవ్ రెండవ భార్యకు పద్దెనిమిది పుట్టారు. వీరిలో పన్నెండు మంది కవలలు. మరో రెండు కాన్పులలో ముగ్గురేసి పుట్టారు. మొత్తంమీద ఫియోడర్ కు  87 మంది పిల్లలు. ఇది ఒక రికార్డుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.

కామెంట్‌లు