చన్నీళ్ళతో స్నానం;- - యామిజాల జగదీశ్
 చల్లటి నీటితో స్నానం చేశాక మళ్లీ శరీరం వేడెక్కుతుంది. ఫలితంగా శరీరంలోని కొవ్వు కరిగి వేడి పుడుతుంది. అందుకే రోజూ చన్నీళ్ల స్నానం చేస్తే ఏడాదికి నాలుగు కిలోల బరువు తగ్గుతారట.
అందుకే చన్నీళ్ళ స్నానం గురించి కొన్ని విషయాలు చూద్దాం...చల్లని నీళ్లతో స్నానం వల్ల శరీరం వణుకుతుంది. అంటే కండరాల్లో కదలిక ఉంటుంది. ఫలితంగా అవన్నీ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఇంకొన్ని క్యాలరీలు ఖర్చవుతాయి. అందుకే పాశ్చాత్య దేశాల్లో బరువు తగ్గడానికి ఐస్‌బాత్‌లకు వెళుతుంటారు. చన్నీటి స్నానంతో లింఫటిక్‌ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. చల్లని నీరు నేరుగా లింఫ్‌ రక్తనాళాలను ప్రభావితం చేస్తుంది. దాంతో అవి చురుగ్గా మారతాయి. చల్లదనానికి ఆ రక్తనాళాలు సంకోచించి మళ్లీ వ్యాకోచిస్తుంటాయి. ఈ ప్రక్రియ కారణంగా శరీరంలో పేరుకున్న ఇన్ఫెక్షన్లు టాక్సిన్లూ రసాయనాలూ అన్నీ బయటకు పోతాయి. ఈ లింఫటిక్‌ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే చాలా మంది తరచూ జలుబు బారిన పడుతుంటారు. చన్నీటి స్నానం వల్ల ఒత్తిడికి కారణమైన హార్మోన్ల విడుదల తగ్గుతుంది. దాంతో ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. పైగా చర్మమూ జుట్టూ ఆరోగ్యంగా మృదువుగా ఉంటాయి. చల్లని నీళ్లు స్వేదరంధ్రాల పరిమాణాన్ని తగ్గిస్తాయి. దాంతో చర్మం బిగుతుగా మారి, నూనె విడుదల చేయకుండా ఉంటుంది. ఫలితంగా చర్మం జిడ్డు కారకుండా ఆరోగ్యంగానూ ఉంటుంది. పొడిచర్మం వాళ్లకి ఇది మంచిదే. రక్తప్రసరణ వేగంతోబాటు ఊపిరి తీసుకునే వేగం పెరుగుతుంది. ఫలితంగా శరీరంలో చురుకు పుడుతుంది. గుండె వేగం పెరగడం

తో శరీరంలోని అన్ని అవయవాలు ఎక్కువ ఆక్సిన్‌ పీల్చుకుంటాయి. దాంతో మొత్తంగా ఆరోగ్యం మెరుగవుతుంది. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. దేన్నయినా తట్టుకునే మానసిక దృఢత్వం కూడా చన్నీటి స్నానం చేసేవాళ్లలో ఎక్కువ. అయితే అలవాటు లేని వాళ్లకి అస్సలు పడకపోవచ్చు కూడా. అలాంటప్పుడు ఎవరి శరీరతత్వాన్ని బట్టి వాళ్లు నడుచుకోవడం మంచిది.
 
కామెంట్‌లు