అమెరికాకు బతుకుతెరువు కోసం వెళ్ళిన ఒక తమిళుడు సాహసం చేసి ఒక చిన్న బడ్డీ కొట్టు ప్రారంభించాడు. తమిళనాడులోలాగే ఈ కొట్లో అతను మిఠాయిలు, జంతికలు వంటివి విక్రయిస్తున్నాడు.
ఈ దుకాణం అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని కమింగ్ అనే ప్రాంతంలో నడుపుతున్నాడు. ఈ దుకాణం పేరు అ. సొ. పయ. బడ్డీకొట్టు. ఈ కొట్లో వేరుసెనగ ఉండలు, తేనె మిఠాయి, బెల్లం కొబ్బరి కలిపి చేసే మిఠాయి, మసాలా బొరుగులు, వడియాలు, బటర్ బిస్కెట్లు వంటివి అమ్ముతున్నాడు. ఇవి కాకుండా మసాలా వడ, టీ కూడా ఇక్కడ దొరుకుతుంది. మాకెక్కడా బ్రాంచీలు లేవు అనే బోర్డుని కూడా దుకాణంలో వేలాడదీశాడు. ఇది తమిళనాడులోని బడ్డీ కొట్టులాంటిదని చెప్పడానికి దినపత్రికల తాలూకు పోస్టర్లు కూడా దుకాణం ముందర చూడొచ్చు. వార్తాపత్రికలో వెలువడే వార్తలలో అతి ముఖ్యమైన వార్తల శీర్షికలను పెద్ద అక్షరాలతో ఆయా తమిళపత్రికలు పోస్టర్లను ప్రచురించి దుకాణం ముందర తగల్చడం తమిళనాడులో ఓ సంప్రదాయంలా వస్తోంది. అటువంటి పోస్టర్లను ఇక్కడ చూడవచ్చు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి