భగవద్గీత 16వ అధ్యాయం లోని 21వ శ్లోకంలో కోపాన్ని నియంత్రించు కోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించాడు.
త్రివిధాం నరక స్యేదం ద్వారం నాశనమాత్మన: |
కం: క్రోధ స్తథా లోభస్తస్మాదే తత్రయం త్యజేత్ ||
ఆత్మ కోసం స్వీయ-నాశనానికి దారితీసే మూడు ద్వారాలు ఉన్నాయి-కామం, కోపం మరియు దురాశ. కాబట్టి, మూడింటిని విడిచిపెట్టాలి.కారణాలు మరియు ప్రభావాలే కాదు, కోపాన్ని జయించే మార్గాలను కూడా భగవద్గీత చర్చించింది. లక్షణాలతో మాత్రమే వ్యవహరించే బదులు, కోపానికి మూలకారణాన్ని అరికట్టడంపై ఇది నొక్కిచెప్పింది, అది కామం అని చెప్పబడింది. క్రోధము కామము నుండి పుడుతుంది మరియు మనిషిని దుష్టకార్యాలలో మునిగిపోయేలా చేస్తుంది. కామాన్ని విస్మరించడం ద్వారా కోపాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.కోపం ఒక శక్తివంతమైన మరియు విధ్వంసక శక్తి కావచ్చు, కానీ అది సానుకూల మార్పు కోసం కూడా ఉపయోగపడుతుంది. కోపం అనేది వివిధ పరిస్థితులకు ప్రతిస్పందనగా ఉత్పన్నమయ్యే సహజమైన భావోద్వేగం, కానీ అదుపు చేయకుండా వదిలేస్తే అది విధ్వంసక శక్తిగా కూడా మారుతుంది.కోపానికి గురికాకుండా ఉండటం మనశ్శాంతికి శీఘ్రమైన మార్గం. కోరికలకు ఆటంకాలేర్పడడం వల్ల ఒకరికి కోపం వస్తుంది….ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా, కోరుకున్నవి నెరవేర్చుకోవడం కోసం భగవంతుని వైపు చూసేవారికి తన తోటి వారి పట్ల కోపం గాని లేదా నిరాశను గాని కలుగదు. భగవంతుడే విశ్వాన్ని నడుపుతున్నాడని తెలుసుకొని సాధువు తృప్తి చెందుతాడు….ఆయన చిరాకు, ద్వేషము, క్రోధము లేనివాడు అని శ్రీ పరమహంస యోగానంద కోపం గురించి చక్కగా విశదీకరించారు.కోపం సహజమైనది కాదు. అది ఆయా పరిస్థితులను బట్టి మనలో ప్రవేశిస్తుంటుంది. ఇంతకు మనిషిలో కోపం ప్రవేశించడానికి కారణం ఏమిటి? అందుకు కారణం ‘కామం’. కోరికకే కామం అని పేరు. ఎప్పుడైతే ఇష్టమైన వస్తువు లభించక, ఇష్టం కాని వస్తువు లభిస్తుందో అప్పుడు కోపం వస్తుంది. తద్వారా కోపానికి కారణం కోరిక అని మనం అర్ధం చేసుకోవాలి.తన కోపమే తన శత్రువు అని ఊరికే చెప్పలేదు పెద్దలు. కోపాన్ని ఆశ్రయించిన వ్యక్తికి విజయం దూరం అయిపోతుంది. బంధువులు దూరమైపోతారు. ఆనందం దూరమైపోతుంది. చివరికి ఒంటరితనమే మిగులుతుంది. ఏదైనా జరిగినప్పుడు అసహనాన్ని, కోపాన్ని ప్రదర్శించే బదులు కాస్త శాంతి తత్వాన్ని చూపిస్తే ఆ సమస్య ఇట్టే కరిగిపోతుంది. కోపం వల్ల క్షణికావేశంలో చేసే పనులు జీవితాంతం వెంటాడుతాయి. అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలి. ఇంకా చెప్పాలంటే కోపాన్ని జయించాలి.కోప్పడే వ్యక్తులు ప్రశాంతంగా ఉండలేరు. రక్తపోటు కూడా పెరిగిపోతుంది. శ్వాస ఆడడం కష్టమవుతుంది. తలనొప్పి తరచూ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీరు వీరితో స్నేహం చేసేందుకు కలిసి జీవించేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు.
అధిక కోపం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మితిమీరిన కోపం తెచ్చుకోవడం ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారుతుంది. కోపం వల్ల తలనొప్పి, అధిక రక్తపోటు, నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది.కోపం కారణంగా కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరుగుతాయి. కోపంగా ఉన్న సమయంలో మన మెదడులోని రక్తనాళాలు సంకోచిస్తాయి. ఇలాంటి పరిస్థితులలో కోపం ఒక్కొక్కసారి రక్తనాళాలు దెబ్బతినేలా చేస్తుంది. విపరీతమైన కోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది.అందుకే కోపాన్ని జయించి తన శాంతమే తకు రక్ష సూత్రాన్ని వంటబట్టించుకోవడం అవసరం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి