శ్లో:
నాలం వా పరమోపకారకమిదం త్వేకం
పశునాంపతే
పశ్యన్కుక్షిగతాన్ చరాచరణ గణాన్ బాహ్యస్థితాన్ రక్షితుమ్
సర్వామర్త్యపలాయనౌషధ మతిజ్వాలాకరం భీకరం
నిక్షిప్తం గరళం గళే నగిళితం నోద్గీర్ణమేవ త్వయా!
భావం: ఓ పశుపతీ! ఓ దేవా! నీవు కడుపులో ఉన్న చరచరా ప్రాణులను, బయట ఉన్న అన్ని దేవతలు మొదలైన వారిని చూస్తూ అతి భయంకరమైన హాలా బలమును గొంతులో వేసుకుని అక్కడనే ఉంచుకున్నావు. బయటకు ఉమ లేదు, కడుపులోకి మింగనూ లేదు, కడుపులో ఉన్న మూడు లోకములకు, బయట ఉన్న దేవతలకు గొప్ప ఉపకారం చేసితివి కదా! ఈ కార్యము ఒక్కటి నీ యొక్క దేవత్వమును
చాటుతున్నది.
*****
🪷శివానందలహరి🪷- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి