వ్యోమగామి సెర్గీ క్రికలేవ్;- - యామిజాల జగదీశ్
 1991లో 311 రోజులు అంతరిక్షంలో ఉండిపోయిన వ్యోమగామి. అతని పేరు సెర్గీ క్రికలేవ్. సోవియట్ యూనియన్ కు చెందిన వ్యోమగామి. అతను "ది మీర్" అనే సోవియట్ స్పేస్ స్టేషన్‌లో అంతరిక్షంలో చిక్కుకున్నాడు. 
క్రికలేవ్ ఒక అనుభవజ్ఞుడైన వ్యోమగామి అయినప్పటికీ అంతరిక్షంలో ఉండి పోవలసి వచ్చింది. 
అతను తన జీవితంలో మొత్తం 803 రోజుల 9 గంటల  39 నిమిషాల పాటు అంతరిక్షంలో గడిపాడు.
1991 డిసెంబర్ 26న, క్రికలేవ్ అంతరిక్షంలో ఉండగానే సోవియట్ యూనియన్ కూలిపోయింది. సోవియట్ యూనియన్ రద్దు సమయంలో ఏర్పడిన రాజకీయ సమస్యల కారణంగా, క్రికలేవ్ 311 రోజులు అంతరిక్షంలో గడిపాడు. చివరికి, అతను 1992 మార్చి 25న భూమికి తిరిగి వచ్చాడు. అతను చాలా కాలం పాటు భూమి గురుత్వాకర్షణకు దూరంగా ఉండటం, అలాగే టైమ్ డైలేషన్ కారణంగా, అతను అదే సమయంలో జన్మించిన వ్యక్తుల కంటే 0.02 సెకన్లు పెద్దతనుగా చరిత్రపుటలకెక్కాడు.  అతన్ని "ది లాస్ట్ సోవియట్ సిటిజన్" అని పిలిచేవారు.
సెర్గీ కాన్‌స్టాంటినోవిచ్ క్రికలేవ్ 1958  ఆగస్ట్ 27న జన్మించారు. ఇతను మెకానికల్ ఇంజనీరు.
ప్రముఖ రాకెట్ శాస్త్రవేత్త.  అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన క్రమంలో గెన్నాడీ పడల్కా , ఒలేగ్ కోనోనెంకో, యూరి మాలెంచెంకోల తర్వాత నాల్గవ స్థానంలో నిలిచాడు.
అతను 2007లో వ్యోమగామిగా పదవీ విరమణ చేశాడు. స్పేస్ కార్పొరేషన్ ఎనర్జీ వైస్ ప్రెసిడెంటుగా  2009 నుండి 2014 వరకు ఉన్నాడు. అతను యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రానికి నాయకత్వం వహించాడు.

కామెంట్‌లు