మన కనీస బాధ్యత:- -గద్వాల సోమన్న,-9966414580
దేశభక్తి ప్రేరేపించే
వ్యక్తిత్వం పెంపొందించే
కథలెన్నో వ్రాసి చెప్పాలి
బాలల మదుల్లో నింపాలి

ఉత్తమ పౌరులుగా దిద్దే
మేటి సూక్తులెన్నొ నేర్పాలి
ఉన్నతంగా ఎదిగేందుకు
మన సహకారమందించాలి

పిల్లల్లో సృజనాత్మకతకు
మార్గాలు అన్వేషించాలి
వారి వ్యక్తిత్వ వికాసానికి 
బలమైన పునాదులు వేయాలి

స్వతంత్ర సమరయోధుల త్యాగము
పదే పదే గుర్తు చేయాలి
వారిపై ఆరాధనభావము
ఆకాశమంత రావాలి

ఈనాటి బాలలే కాదా!
రేపటి మన దేశ నాయకులు
లేశమైనా బాధ్యత లేదా!
చేయాలోయ్! ఉత్తమ పౌరులు


కామెంట్‌లు