న్యాయములు-684
వాజ్ఞ్నియమ న్యాయము
*****
వాజ్మయం/ వాంగ్మయము అనగా మాటలతో నిండినది,మాటలపై ఆధారపడినది, సాహిత్యము, భాష ఉపన్యాసము.వాజ్నియమము అనగా మౌని,వాజ్నియమము కలవాడు.
"వాక్కులు నియమితములై ఉన్నట్టు" అని అర్థము. వాక్ అనే శబ్దానికి మయట్ అనే ప్రత్యయం చేరడంతో వాజ్మయం అనే శబ్దం ఏర్పడింది. వాజ్మయం అంటే వాక్కులతో నిండినది అని అర్థము.
వాజ్మయంలో శాస్త్ర వాజ్మయం మరియు కావ్య వాజ్మయం అని రెండు రకాలు ఉంటాయని రాజశేఖర పండితులు పేర్కొన్నారు.
అయితే వాజ్మయమమునకు మూల దేవత వాగీశ్వరి లేదా వాగ్దేవి. ఈ వాజ్మయంలో నాలుగు రకాల దోషాలు ఉండకూడదని మను శాస్త్రంలో చెప్పినప్పటికీ అవే దోషాలు వస్తూనే ఉన్నాయి.
ఆ దోషాలలో ఒకటో దోషము పారుష్యము అనగా వాడియైన లేదా పదునైన మాటలను ఉపయోగించుట. మరి ఇలాంటి పరుషమైన పదాలు మాటల్లోనూ,రాతల్లోనూ నేటికీ వస్తూనే ఉన్నాయి.
ఇక రెండోది అనృతము అనగా అసత్యము లేదా అబద్ధము. ప్రస్తుత కాలంలో కొందరు తమ పబ్బం గడుపు కోవడానికి ఎన్నైనా అబద్ధాలు అలవోకగా ఆడటానికి ఏమాత్రం వెనుకాడటం లేదు.
మూడోది పిశునత అనగా చాడీలు లేదా కొండెములు చెప్పుట. తాను మంచివాడినని చెప్పుకోవడానికి ఇతరుల మీద రకరకాల లేనిపోని చాడీలు చెప్పేవారిని మనం చూస్తూ ఉన్నాము.
చివరిదైన అసంబద్ధ ప్రలాపము లేదా ప్రేలాపన అనగా సమయం సందర్భం లేకుండా మాట్లాడటం.అది వారి అవివేకం ,అజ్ఞానం, అహంకారాన్ని సూచిస్తుంది.
వాక్కులు ముందుగానే నియమితమై ఉంటాయి.అలాంటి వాక్కులకు నాలుగు రకాల దోషాలు అంటకుండా చూసుకోవాలి.
ఈ విధంగా వాజ్మయంలో వాజ్నియమాలతో పాటు నాలుగు రకాల దోషాలు కూడా ఉన్నాయని మనం తెలుసుకున్నాం.
మరి ఈ "వాజ్నియమ న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా ఎందుకు చెప్పి ఉండవచ్చు అనేది పై విషయాలను బట్టి ఈ పాటికి అర్థమై వుంటుంది.
మనం ఎప్పుడు మాట్లాడినా పై విషయాలన్నీ గమనంలో పెట్టుకోవాలి. పరుషమైన మాటలతో ఇతరులను ఎప్పుడూ గాయపరచవద్దు.
వాక్కుకు ఎంత శక్తి ఉందో మనందరికీ తెలుసు.అలాగే ఎప్పుడూ అబద్ధాలు ఆడకూడదు. మనం బలి చక్రవర్తి కథ చదివినప్పుడు ఓ మాట వింటాం.
బలి చక్రవర్తి తన గురువైన శుక్రాచార్యుడు ఓ చిన్న అబద్ధం ఆడొచ్చు అని చెప్పినప్పుడు బలి ఈ విషయం చెబుతాడు "భూదేవి ఎవరినైనా భరిస్తానంటుంది కానీ అబద్ధాలు ఆడే వారిని భరించలేను అని" కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడకూడదు.
ఇక స్వప్రయోజనాల కోసమని ఇతరులపై చాడీలు చెప్పడం గానీ, సందర్భం లేకుండా ఒకదాని కొకటి పొంతన లేకుండా మాట్లాడ కూడదనేది తెలుసుకుని మాట్లాడితే మన మాటే మనల్ని విజయాల వైపు నడిపిస్తుంది.ఆ విషయం తెలుసుకుని ఆ విధంగా మసలుకుందాం.ఏకీభవిస్తారు కదూ!.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి