శరణం శరణం ఓయీ బాబా
సాయి శరణం మా ఈ బాబా
మరణం అన్నది లేదులే మీకు
శరణం అన్నది ఉందిలే మాకు !
శరణం శరణం ఓ బాబా
స్వామి శరణం మా బాబా
షిరిడిలో నువ్వు పుట్టావు
మా ఇంట్లో కాలు పెట్టావు!
శరణం శరణం ఓ బాబా
స్వామి శరణం మా బాబా
పూజా గదిలోకి వచ్చావు
పూజాఫలమునే ఇచ్చావు !
శరణం శరణం మా ఇంటి బాబా
సాయి శరణం మా కంటి బాబా
పదిలంగానే నువ్వు ఇక ఉన్నావు
మా మదిలోని కోర్కెలను విన్నావు
శరణం శరణం ఓ షిరిడి బాబా
సాయి శరణం శివ గుడి బాబా
ఊడికే అన్నంలో చేయ్యి వేశావు గరిటగా తిప్పి రుచినే చూసావు !
శరణం శరణం విను బాబా
సాయి శరణం ఇక కనుబాబా
నిత్యం స్మరణం చేస్తాం బాబా
నీ నిత్య పూజకు వస్తాం బాబా !
శరణం శరణం మా శివ బాబా
సాయి శరణం ఓ సాయి బాబా
షిరిడిలో వెలిసావు నువు బాబా
గుండె గుడిలో కలిసావు ఓబాబా
శరణం శరణం మా శక్తి బాబా
సాయి శరణం విముక్తి బాబా
అందించు ముక్తిని మా బాబా
స్పందించు భక్తితో నువు బాబా !
శరణం శరణం ఓ సద్గురు బాబా
స్మరణం స్మరణం జగద్గురు బాబా
మా దీవెన పావన బంధువు బాబా
శోధించి సాధించే సిందువు బాబా!
శరణం శరణం పుత్రాధ్యేయ బాబా
స్మరణం స్మరణం దత్తాత్రేయ బాబా
మా ఇంటి దేవుడవు నీవేగా బాబా
మా కంటికి దూరమాయె నీ డాబా!
శరణం శరణం సాయినాథ్ బాబా
సాయి స్మరణం గోరఖనాథ్ బాబా
షిరిడి నగరమే నీ పండరిపురము
అందరికీ అది అందించులే వరము
శరణం శరణం షిరిడి శివ బాబా
సాయి స్మరణం ఓ శక్తీశ్వర బాబా
శ్రీకాంతుడవు ఇక నువ్వేగా బాబా
శ్రీమంతుడవు ఐ వున్నవులే బాబా
శరణం శరణం శక్తీశ్వర మా బాబా
సాయి శరణం ముక్తేశ్వర ఓ బాబా
స్మరణ స్మరణం సహదేవ ఓ బాబా
గురు చరణం స్మరణం నీవే బాబా
అందరికీ ఆప్తుడు ఈ షిరిడీ బాబా
సుందర స్వరూపుడులే మా బాబా
చూచి తరించాలిక ఆయన శోభా
మెరిసే విరిసే తన మోములో ప్రభా
జయహో జయహో షిరిడీ బాబా
జయ జయ జయహో మా బాబా
జయ విజయంతో నువు రా బాబా
గోమాత నినుగని అననుగా అంబా
నీ తత్వాన్నిక వినిపించు ఓ బాబా
నీ మహత్యాన్ని చూపించు బాబా
నీ దివ్యత్వంతో దీవించు ఓ బాబా
మావందనముల గైకొను మా బాబ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి