ముత్యాల హారాలను నూతన లఘు కవితా ప్రక్రియ రూపకర్త అయిన గౌ. శ్రీ. రాథోడ్ శ్రావణ్ గారు పండుగల ముత్యాల హారాలకు ముందుమాట వ్రాయమని వారు కోరుతూ తను వ్రాసిన కొన్ని ముత్యాల హారాలను నాకు పంపినారు. వీటిని కూలంకషంగా ఓ వారం రోజులపాటు పరిశీలించాను. అవి నా మనసును ఆకట్టుకున్నాయి. ఒకదానిని మించి ఒకటి మిన్నగా ఉన్నాయి. వాటిలో తాజాదనం, కృత్రిమత్వం లేని సహజ సిద్ధాత్వం, పరిపూర్ణమైన పరిపక్వత ఆలోచనలు, సహజమైన భావ విధానం, ముఖ్యంగా ,"పండుగలు ముత్యాల హారాలు"కవితా రచనల్లో రాథోడ్ శ్రావణ్ గారి పాటవం నన్నెంతో ఆకట్టుకున్నది.
వీరి కవిత్వంలో విషయ సమూహమును, వ్యక్తీకరణ శైలిని, చూశాక ఇంత వేగంగా ముత్యాల హారాల ప్రక్రియలో ప్రవేశించి తక్కువ సమయంలో దశకందాక తన సంకలనాలను తీసుకురావడం అతనికే చెల్లింది. ముత్యాల హారాల కవితాత్మలోకి అమిత వేగంగా ప్రవేశించిన కవి మరొకరు లేరేమో అని నాకు అనిపించింది. లేకపోతే మీరు ఒక్కసారి ఈ క్రింది ముత్యాల హారాలను పరిశీలించండి.
ఉగాది మన పర్వదినం
పచ్చడి రుచి కమ్మదనం
తేట తెలుగు తీయదనం
అందరికీ పండుగ దినం !
బ్రహ్మ పునః సృష్టి కాలాన్నీ బ్రహ్మకల్పం అంటారు. ప్రతి కల్పంలోనూ ప్రథమంగా వచ్చేది యుగాది. యుగానికి ఆదిగా వచ్చేది యుగాది. అదే మన ఉగాది. ఉగాది అంశాన్ని తీసుకొని ఈ పర్వదినాన్ని అద్భుతంగా, అమోఘంగా తన లఘు కవితలో పచ్చడి రుచిని తెలుగువారికి రుచి చూపించారు., తీపి, చేదు, వగరు, పులుపు కషాయాల కలియకే కష్టసుఖాల జీవితమని చెప్పకనే చెప్పి పండుగ ప్రాశస్యాన్ని చాటి చెప్పుట అత్యంత శ్లాఘనీయం. అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక వెతుకు చాలినట్లు, వీరి ముత్యాల హారాల విశిష్టత తెలుసుకోవడానికి పై ఒక్క ముత్యాల హారం చాలు. అలతి అలతి పదాలతో పండుగ విశిష్టత వర్ణించడం కవి ప్రతిభకు సాక్ష్యం. ఇలాంటి సాక్షాలు ఈ పండుగల ముత్యాల హారాలలో అనేకంగా కనిపిస్తాయి. అవి మనల్ని అమితంగా ఆకర్షిస్తాయి.
వాస్తవ జీవనానికి అద్దం పట్టేటట్లుగా తమ ప్రదర్శనను వ్యక్తం చేస్తాయి. కవి గారికి విస్తృతంగా పరిశీలించే గుణం ఉంది. విభిన్న దృష్టి కోణాలతో విషయాన్ని పరిశోధించే సామాజిక అవగాహన వీరి ముత్యాల హారాల్లో మనకు విస్తృతంగా కనిపిస్తుంది.
ఏది ఏమైనా ముత్యాల హారాల నూతన ప్రక్రియలో సరికొత్త లకు కవిత్వంతో వీరు కొత్త పంటను రాసులు రాసులుగా పండించారు. వీరి ముత్యాల హారాల్లో వస్తు వైవిధ్యం విస్తృతంగా ఉంది. అవి చాలా చాలా తాజాగా ఉన్నాయి.
వీరి శైలి ప్రత్యేకమైనది. ఘడత సుకుమారత, తీవ్రత, సహాయ సహకార శిల్ప నైపుణ్యం కలబోసుకున్న ముత్యాల హారాలు ఇవి. ప్రతి హారాన్ని కుచ్చడంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నారు. అందుకు శ్రీకృష్ణ, శ్రీరామ నవమి, వినాయక చవితి, ముత్యాల హారాలే నిదర్శనం. ఈ పండుగల ముత్యాల హారాల పుస్తకం అగ్రశ్రేణి ముత్యాల హారాల సంకలనాల సరసన చేరుతుందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈ ముత్యాల హారాలు నాకు సంతృప్తిని కలిగించాయి. వీటికి ముందుమాటలు వ్రాయుటకు అవకాశం కల్పించిన శ్రీ గౌరవనీయులు రాథోడ్ శ్రావణ్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. వీరు ముందు ఇంకా ఇలాంటి మంచి ముత్యాల హారాలను తెలుగు ప్రజలకు అందిస్తారని వారిని మనసారా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా.
సహస్ర కవి, కవి మిత్ర, కవి భూషణ(సౌమిత్రి)యైన
.
మీ గుర్రాల లక్ష్మారెడ్డి
కల్వకుర్తి. సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి