నాగుట్టు గమ్మత్తు:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
నాగుట్టు
గుండెలోదాచుకున్నా
లబ్ డబ్ కొట్టుకుంటున్నా
అణచివేస్తున్నా

నాగుట్టు
గుప్పెట్లోపెట్టుకున్నా
తెరవమంటున్నా
గట్టిగాబిగిస్తున్నా

నాగుట్టు
గోలచేస్తున్నా
గమ్ముగుంటున్నా
గొణకలేకున్నా

నాగుట్టు
రట్టుచేయమంటున్నా
కట్టడిచేస్తున్నా
ఖబడ్దారంటున్నా

నాగుట్టు
గేళిచేస్తున్నా
నోరుమూసుకున్నా
పట్టించుకోకున్నా

నాగుట్టు
గొడవచేస్తున్నా
లొంగకున్నా
వంగకున్నా

నాగుట్టు
విప్పకున్నా
తిట్టినా
కొట్టినా

నాగుట్టు
నాప్రాణం
నామానం
నాభయం

నాగుట్టు
నాదాపరికం
నాలోనిమర్మం
నానామరహస్యం

నాగుట్టు
రట్టుచేస్తున్నా
నాఒట్టు
వదిలిపెడుతున్నా

ఉత్కంఠకు
తెరదీస్తున్నా
నాపేరు అంకయ్యా....
నాభార్య సింగమ్మా...

ముతకోడినని
అవహేళనచేయరుకదా!
మూర్ఖుడనని
నిందమీదవెయ్యరుకదా!

అంకడన్నా
పరవాలేదు
సింగియన్నా
నామూషీలేదు

తమాషాగా
తీసుకోండి
పెద్దగాపకపకా
నవ్వుకోండి


కామెంట్‌లు