పడిపోయిన చిక్కుముళ్ళు
విడిపోయి కలిసేలా
సడి లేక ఆగమించు
వేకువ నీవు.
అలసిన ఆరాటపు ఆశలపై
అమృత ధారగా కురిసి
అపురూప అనుభవమిచ్చు
వేకువ నీవు
అకారణ కష్టాల బెదిరిపోయిన
అంతరంగాలను ఊతమిచ్చి
అనునయించి ఆదరించు
వేకువ నీవు
విఫలమైన ప్రయత్నాలతో
విరమించే నిర్ణయాలకు
వివరించి ఊపిరూదే
వేకువ నీవు
కొండంత చీకటిని తరిమేసి
అండగా ఉంటానంటూ
నిండు వెలుగులు నింపే
వేకువ నీవు
కోటికోరికలు మది తోటలో
పోటీ పడి అల్లరి చేస్తుంటే
వాటికి మాట ఇచ్చి మరపిస్తూ
వచ్చే వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి