తిరుమలరావు మాస్టారుకు గ్రామస్తుల సన్మానం

 పాతపొన్నుటూరు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావును, ఆ గ్రామవాసులు ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ వేదికపై తిరుమలరావు సేవలను కొనియాడుతూ శాలువా, పూలమాలలతో సర్పంచ్ ఎద్దు చామంతమ్మ, స్థానిక యువనేత ఎద్దు సంతోష్ కుమార్ కోటీశ్వరి దంపతులతో పాటు, ఉప సర్పంచ్ గుజ్జ రామారావు, విశ్రాంత విఆర్వో బలగ అప్పారావునాయుడు, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్ పర్సన్ బలగ రజనీ కుమారి, వైస్ చైర్మన్ గేదెల తేజేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, బూడిద సంతోష్ కుమార్, బొమ్మాళి నాగేశ్వరరావు, యిసై సౌజన్యవతిలు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ‌సచివాలయం కార్యదర్శి జన్ని చంద్రమ్మ, విద్యా సంక్షేమ కార్యదర్శి బి.సుధాకర్, మహిళా రక్షణ విభాగ కార్యదర్శిణి పడాల తేజస్విని, ఎఎన్ఎం కొత్తకోట అరుణకుమారి, అంగన్వాడీ కార్యకర్త పతివాడ కాంచనమాల, ఆయా అల్లాడ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
తిరుమలరావు 1989లో ఉద్యోగంలో చేరి 1999, 2004, 2009 లలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను పొందియున్నారు. నిరంతర కృషితో విద్యార్థులకు గుణాత్మక విద్యను అందిస్తూ, అదనపు సమయాల్లో  రచయితగా, చిత్రకారునిగా, గాయకునిగా, నటుడిగా, సామాజిక సేవకునిగా పాల్గొంటూ అనేక సత్ఫలితాలను సాధిస్తూ, బహుమతులను పురస్కారాలను పొందుతున్నారు.
కామెంట్‌లు